లక్ష్మీ అనుగ్రహం
1. ప్రతీ శుక్రవారం గడపను పసుపు, కుంకుమలతో అలంకరించాలి. పసుప, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీ దేవికి ఆహ్వానం పలుకుతాయి.
2. గడప దగ్గర చెప్పులను చిందరవందరగా పడేయకూడడు. గడప మీద కూర్చోవడం, గడపను తొక్కడం, గడపకు అటుఇటు చెరోకాలు వేసి నిలబడటం చేయకూడదు.
3. పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిపోయిన, పాడైన వస్తువులను పదార్థాలను ఎప్పటికప్పుడు బయట పారవేయాలి
4. ముగ్గులు వేసిన ఇల్లు లక్ష్మీ దేవికి.ఆహ్వానం పలుకుతాయి. అందుకే తెల్లవారగానే ఇల్లు ఊడ్చి ముగ్గులు పెట్టాలి.
5. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం, చెడుమాటలు మాట్లాడటం, చెడు తిట్టులు తిట్టడం చేయకూడడు.
6. ఇరు సంధ్యలలో (ఉదయం, సాయంత్రం) దీపారాధన చేయటం సాయంత్రం పూట సాంబ్రాణి ధూపం వేయటం చేయాలి.
7. సీతాఫలం, దానిమ్మ, పూలతీగ చెట్లలోను లక్ష్మీ మాత ఉంటుంది, వాటిని వంట చెరూకుగా వాడటం, అనవసరంగా వాటి కొమ్మలు, రెమ్మలు తుంచడం చేయకూడదు. వాటికి మురికి నీరు పొయకూడదు.
8. స్నానం చేసిన టవళ్ళు, బట్టలు మనం ధరించేవి, ధరించినవి, మాసినవి ఎటువంటి వస్త్రాలు గడపలపై, తలుపులుపై వేయకూడడు.
9. బట్టలు ఉతికిన తరువాత స్నానం చేయాలి. విడిచిన వస్త్రాలు కాలితో తొక్కడం, బట్టలు ఉతికిన నీరు, మురికి నీరు కాలిపై పోసుకోవటం, చేయకూడదు.
10. డబ్బు, నగలు వంటి విలువైన వస్తువులు పెట్టే బీరువాలకు అద్దం ఉండకూడదు. ఆ అద్దంలో ముఖం చూసుకోవటం, తల దువ్వుకోవటం చేయకూడదు.
11. వారానికి ఒకసారైనా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. రాత్రీపూట మంగళ సూత్రాలు, గాజులు తీసేసి పడుకోకూడడు. మంగళ సూత్రంలో పిన్నీసులు, లాకెట్స్ , దేవతా ప్రతిమలు ఉండకూడదు
12. స్త్రీలు ఎప్పుడూ మంగళ చిహ్నలు ధరించాలి. అంటే గాజులు ధరించటం, కాళ్ళకు పట్టీలు, మెట్టెలు, మెడలో మంగళ సూత్రం, చెవులకు చెవి దిద్దులు, నుదురుపై మరియు పాపిట బొట్టు పెట్టుకోవాలి.
13. ఇంటిలో మురళీనాదం చేస్తున్న కృష్ణుడు విగ్రహాలు, చిత్రాలు కాకుండా ఆవుతో ఉన్న కృష్ణుని విగ్రహలు, చిత్రాలు ఉండాలి
14. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవారు తులసిని కోయకూడడు. పొద్దుపోయాక నీరు పోయకూడడు.
15. ఇంటి దగ్గర తమలపాకు చెట్లు, తమలపాకు తీగలు ఉంచకండి అవి తోటల్లోనూ, చేలలో మాత్రమే ఉండాలి. తమలపాకు గౌరీ స్వరూపం ఎట్టిపరిస్థితుల్లోనూ మైలగాలి తగలకూడదు.
16. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉండకూడదు.
17. నిద్రలేవగానే దుప్పట్లు దులిపి మడటపెట్టాలి లేకపోతే దరిద్రదేవత ఆసనం వేసుకుని కూర్చుని ఆవహిస్తుంది.
18. భోజనాలు పూర్తి అయిన తరువాత వంట పాత్రలు ఏరోజు పాత్రలు ఆరోజే కడిగేయాలి. పాచిపోయిన పదార్థాలు పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
19. కొంతమంది శుక్రవారం భోజనాలు అయిన తరువాత తపాలాలు, గుండిగలు, డాకలు వంటపాత్రలు శనివారం నాడు తోముతారు అదేమిటని అడిగితే శుక్రవారం కదా అందుకే తోమకూడడు అంటారు. అలా చేస్తే దరిద్రదేవతకి ఆహ్వనం పలికినట్టు.
లక్ష్మీ దేవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉన్నచోటే ఉంటుంది. కాబట్టి ఎప్పటి పాత్రలు అప్పుడే శుభ్రం చేసుకోవాలి.
లక్ష్మీ దేవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉన్నచోటే ఉంటుంది. కాబట్టి ఎప్పటి పాత్రలు అప్పుడే శుభ్రం చేసుకోవాలి.
20. పొద్దుపోయాక ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం పెరుగు, కారం, పచ్చళ్ళు, కూరగాయలు ఎవరికీ ఇవ్వకూడడు. అవి లక్ష్మీ స్థానాలు
21. ఇంట్లోకి గానీ కార్యాలయంలోకి (ఆఫీస్) గానీ అకస్మాత్తుగా గుడ్లగూబ ప్రవేశిస్తే లక్ష్మీదేవి కృప, ధనలాభం కలుగుతుందని సూచన.
22. రాత్రివేళల్లో ఇల్లు కడగడం, తూడవడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎర్పడతాయి.
23. వైశాఖ మాసంలో సత్తుపిండి దానం చేస్తే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది.
24. శ్రావణ మాసంలో శివరాత్రి నాడు విశిష్ట దినాలలోనూ శివలింగానికి బిల్వపత్రాలతో పూజ చేయడం వల్ల సంపద, శుభాలు కలుగుతాయి.
25. స్వప్నంలో మలం కనిపించటం, మలంలో పడినట్లు కల రావడం ధనప్రాప్తికి సూచన
26. శంఖం, స్వస్తిక్ చిహ్నం, నాణెం, గుర్రం నాడా దారిలో ఇటువంటి వస్తువులు దొరికితే ఇంటికి తెచ్చుకుని ఇంటి ప్రాంగణంలో కాని, తోటలో కాని చిన్న గొయ్యి తీసి అందులో ఉంచాలి. అలా కుదరకపోతే పూజాస్థలంలో పెట్టాలి
No comments:
Post a Comment