ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదా
సేకరణ 【మార్కండేయ పురాణం】
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు, పచ్చిమం వైపు తలపెట్టి నిద్రించకూడదు అని మార్కండేయ పురాణంలోని మదాలస కథ ద్వారా తెలుస్తుంది. మదాలస అలర్కడు అనే తన కొడుకుకి సదాచారాలు చెప్తూ ఇలా అంటుంది
" కుమారా నిద్రించేటప్పుడు తల తూర్పు దిక్కున గాని, దక్షిణ దిక్కుకు గాని పెట్టి నిద్రించు. ఎటువంటి పరిస్థితులలోనూ పడమర వైపు గాని ఉత్తరం వైపు గాని తల పెట్టి నిద్రించకు. అలా నిద్రిస్తే నీకు కీడు కలుగుతుంది.
కాబట్టి పడుకునేటప్పుడు తల తూర్పు లేదా దక్షిణ దిశగా పెట్టి నిద్రపోవాలి.
(ఈ మధ్య కొందరు సొంత ఊరిలో ఒక దిక్కున తల పెట్టి పడుకోవాలి, వేరే ఊరిలో ఉంటే వెరే దిక్కుకు తల పెట్టాలి అని జనాలను అయోమయంలో పడేస్తున్నారు. కానీ దానికి ఎటువంటి శాస్త్ర పురాణ ఆధారాలు లేవు. శాస్త్ర ఆధారం ఉంటేనే వాటిని పాటించాలి)
No comments:
Post a Comment