శాస్త్ర ప్రకారం తినకూడని పదార్థాలు
★ వంకాయ, అవిశ పూవు, వెల్లుల్లి, పుట్టగొడుగు, ఊరపందీ, జున్ను, గురువింద, తంగేడు, విరిగిన పాలు, మేడు, అల్లనేరేడు, కదంబం, వెలగజువ్వి తినకూడదు.
★ దేవతల బలి అన్నం, గంజి, కుడితి, శుభ్రం చేయని చేపలు, దేవుని భూమిలో పండిన ధాన్యము తినకూడదు.
★ రాత్రి వేళ నువ్వులుతో చేసిన పదార్థాలు, పెరుగు తినకూడదు
★ పాలతో కలిపి మజ్జిగ తాగకూడదు
★ కేశాలు(వెంట్రుకలు) ఉన్నది, కీటకాలు ఉన్నది, సందేహాస్పదమైన అన్నం, కుక్క ముట్టినది, చండాలుడు చూసినది, మళ్ళీ వేడి చేసినది, రజస్వల, పతితులు చూసినది, అనాధరంగా పెట్టినది, పాచిపొయినది, ఆవు వాసన చూసినది తినకూడదు.
★ ఒకరి అన్నం మరొకరికి పెట్టినది, కాకులు,కోళ్లు ముట్టినది, పురుగులు కలది, మనుషులు వాసన చూచినది, కుష్టు వ్యాది ఉన్నవారు తాకినది, రజస్వల, వ్యభిచారిణి, కోపించినవారు పెట్టినది, మురికి బట్టలతో పెట్టిన అన్నం తినకూడదు.
పాలు
★దూడ లేని ఆవుపాలు తాగకూడదు
★ఒంటె పాలు తాగకూడదు.
★ప్రసవించిన పదిరోజుల లోపు ఆవుపాలు,గొర్రె పాలు తాగకూడదు.
★ చూడి ఆవుపాలు తాగకూడదు.
మాంసాహారం తినే వర్ణంలో పుట్టినవారు తినవలసినవి
★ ఉడుము, తాబేలు, కుందేలు, ముళ్ళఏదు,ఏదు, ఐదైదు గోళ్లు కల జంతువుల మాంసం తినవచ్చు.
నెమలి, తిత్తిరి పావురం,కపీంజలం మాంసాలను తినవచ్చు.
చేపలు
★ చేపలలో కొన్ని జాతి చేపలను మాత్రమే తినాలి అవి హంసలు, పరాజితములు, శఫరాలు, సింహతుండములు, పాఠీనము, రోహితము ఈ జాతి చేపలను మాత్రమే తినాలి.
No comments:
Post a Comment