ఇటువంటి వారు పిలిచినా వీళ్ళ ఇంట్లో అన్నం తినకూడదు
ఆహార నియమాలు part 1
సేకరణ 【కూర్మ మహపురాణం】★ మోహం వల్ల కాని మరి ఏ ఇతర కారణాల వల్ల కాని బ్రాహ్మణులు శూద్రుల ఇంట్లో అన్నం తినకూడదు. ఒక వేళ అలా తింటే శూద్రునిగా పుడతారు. (ఆపద సమయాల్లో మాత్రం తినవచ్చు).
*ఆరు నెలలు కనుక బ్రాహ్మణులు శూద్రుల ఇంట్లో అన్నం తింటే జీవించి ఉండగానే శూద్రుడు అవుతాడు. మళ్ళీ జన్మలో కుక్కగా పుడతారు.
★ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నాలలో ఎవరి అన్నం కడుపులో ఉండగా మరణిస్తారో వారు ఆ జాతిలో పుడతారు.
★ రాజ, నర్తక, వడ్రంగి, చర్మకార, బ్రాహ్మణ సమూహ, వేశ్య, నపుంషకుల,చక్రము ఆధారముగా కలిగి బ్రతికేవారు (కుమ్మరి మొదలైనవారు), రజకుల(చాకలి), దొంగల అన్నాలు తినకూడదు.
★ మద్యం అమ్మేవారు, గాయకులు, లోహకారులు, సూతకులు, చిత్రకారుడు, వడ్డీ వ్యాపారం చేసేవారు, పతితులు, మంగళి, భర్త మరణించగా రెండవ వివాహం చేసుకున్న స్త్రీకి పుట్టినవారు, అందరి చేత నిందించబడేవారు, వీళ్ళ ఇంట్లో అన్నం తినకూడదు.
★ స్వర్ణ కారులు, నటులు, వేటగాళ్ళు, బంధితులు, వ్యాధితుడు, వైద్యుడు, పుంశ్ఛలి, దండించేవారు, నాస్తికులు, దేవ నిందకులు, భార్యకు విధేయులై ఉండేవారు, సమాజం చేత బహిష్కరింప బడినవాడు, లోభి, ఎంగిలి అన్నం తినేవారు, సన్యాసి, ఉన్మత్తుల అన్నం తినకూడదు.
★ అన్న వివాహం కాకుండా వివాహం చేసుకున్న తమ్ముడు, తుమ్ముతో అపవిత్రమైన అన్నం, భయంతో ఉన్నవారు, ఏడ్చేవారు, బ్రాహ్మణులను ద్వేషించేవారు, పాపాలు ఇష్టంగా చేసేవారు, శ్రాద్దాన్నం, సూతకాన్నం, శవ వాహకులు, సోమరి, వృత్తి హీనుడై మామగారింట ఉండేవారు, సంతానం లేని స్ర్తీ, తన దగ్గర పనిచేసే వారు వీళ్ళ అన్నం తినకూడదు.
★ శిల్పకారులు, ఆయుధాలను అమ్మేవారు, విదవను పెళ్లి చేసుకున్నవారు, అన్న చనిపోగా అతని భార్యను వివాహం చేసుకున్న సోదరుడు, సంస్కారం లేని గురువు, వీళ్ళ అన్నం తినకూడదు.
మనుషులు చేసిన పాపం అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఎవరి అన్నం తింటామో వారి పాపం కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది.
మినహాయింపులు
★ శూద్రూడైనప్పటికీ బ్రాహ్మణుని పొలంలో వ్యవసాయం చేసి సంపాదించుకున్న అన్నాన్ని ఎవరైనా తినవచ్చు.
★ తాత, ముత్తాతల నుండి బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటున్న వాని అన్నాన్ని ఎవరైనా తినవచ్చు.
★ తమ ఆవులు కాచేవాని అన్నాన్ని తినవచ్చు.
తనను సంపూర్ణంగా బ్రాహ్మణులకు సమర్పించుకున్న వాని అన్నాన్ని తినవచ్చు.
★ గాయకుల, కుంభ కారుల(కుమ్మరి), రైతుల అన్నాన్ని కొద్దిగా మూల్యం చెల్లించి తినవచ్చు.
★ పాయసాన్ని, నేతితో తయారయిన వంటకాన్ని, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను, సత్తు పిండి, తెలక పిండి, నూనె వీటిని శూద్రుల నుండి కూడా స్వీకరించవచ్చు.
No comments:
Post a Comment