యంత్ర మహాత్యం
యంత్రం గురించి దేవభాగవతంలో ఇట్లా ఉన్నది
"అర్చాభావే తథా యంత్రం""
అనగొ పూజించుటకు ప్రతిమలేనప్పుడు దాని ప్రతిరూపంగా యంత్రమును అర్చించవచ్చు అని అర్థం.
మేరు తంత్రం మరియు నారదీయ పురాణంలో భగవంతుని స్థానములు ఏడుగా చెప్పబడ్డాయి.
1. జలము
2. అగ్ని
3. హృదయం
4. చక్రము
5. క్షేత్రం
6. యంత్రం
7. ప్రతిమ
కాలాంతరమున మంత్రపూర్వక యంత్రం ప్రతిమా ప్రతిష్ఠాపనాదులతో విశేష ఫల ప్రదమని ఋషులు గుర్తించారు. మానవుల శారీరక మానసిక బాధలకు యంత్రధారణ సహకరించి బాధా నివృత్తి కలుగుతుందని అనేక బీజాక్షరములతో, సంఖ్యలతో యంత్రములు సృష్టించారు.
యంత్రములు సిద్ధించాలంటే వాటికి నిర్దిష్టములైన బీజాక్షరముల జపములతో మానసిక శక్తి పొంది దానిని యంత్రమునందు నిక్షిప్తం చేసి దాని ధారణ, స్థాపనాదుల వలన ఇష్టసిద్ధి పొందవచ్చు.
యంత్రములు స్థూలంగా రెండు రకాలు
1. మేరు ప్రస్తారం. ఇది రేఖాత్మకముగా ఉండక -కోణం -వృత్తం- చతురస్రం వంటివి త్రీడైమన్షనల్ లో రూపము పొంది ఉంటుంది. ఇవి పూజకు ఉపయోగిస్తారు.
2. భూప్రస్తారం. ఇది కేవలం పొడవు, వెడల్పులు మాత్రమే కలిగి రేకులపై వృత్తం - కోణం మొదలైనవి కలిగి ఉంటుంది. ఎత్తు ఉండదు. ఇవి ఎక్కువగా స్థాపనకు ధారణకు ఉపయోగిస్తారు.
మానవుని శరీర నిర్మాణం ముఖ్యముగా పృథ్వ్యాపోస్తేజో, వాయురాకాశములనే పంఛభూతములతో ఏర్పడినది. మన భూమి కూడా పృథ్వీ తత్వం కలదై ఇతర మహా భూతముల సహయంతో మనము జీవిస్తున్నాం. యంత్రముల సహాయంతో మనం జీవిస్తున్నాం. యంత్రములో లిఖించు రేఖలు - కోణములు - వృత్తములు మొదలగువాటికి పంచభూత మహాతత్త్వములను అనుసంధానించి అకారాది క్షకారాంత వర్ణములలో పంఛభూతముల తత్త్వములను నిర్దేశించి వాటిని యంత్ర సాధనలో ఎలా ప్రయోగించాలో మన పూర్వులు తెలియజేసారు.
యంత్రములో లిఖించు సంఖ్యలకు అధిష్టాన దేవతలు ఈవిధంగా ఉండును
యంత్ర లేఖమునకు ముందుగా బంగారు రేకు శ్రేష్టం. అనంతరం వెండి, రాగి రేకులు మంచిది. భూర్జపత్రం కూడా మంచిదే కాని ఇది తాత్కాలిక ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగిస్తారు. త్రిలోహములు పంచలోహములతో రేకు తయారుచేసిన అది మరింత శ్రేష్టం
యంత్ర లేఖినులు
వివిధ కోరికల సిద్ధికి యంత్రములు వ్రాయునప్పుడు రకరకాల లేఖినులు ఉపయోగించాలి.
లోహాములలో బంగారు, శలాక, వెండి, రాగి మరియు ఇతర ధాతువులతో చేయబడిన లేఖినులు ఉపయోగించబడుతాయి.
ఇవే కాకుండా మొక్కల కాడలు, జాజి, వేప, మర్రి, మామిడి, రావి, మల్లి పుల్లలూ యంత్రాలు లిఖించడానికి లేఖినులుగా ఉపయోగిస్తారు.
ఇవే కాకుండా వివిధ పక్షుల ఈకలు ఇతరములైన ముల్లులు కూడా లేఖినులుగా ఉపయోగిస్తారు
యంత్ర సిద్ధి
1 . యంత్రములు సిద్ధించాలంటే కొన్ని విధులు తప్పనిసరిగా పాటించాలి.
2. సాధకుడు తప్పనిసరిగా పంచాక్షరీ మంత్రం అక్షరలక్షలు జపించి సిద్ధి పొంది ఉండాలి. శివానుగ్రహం ఉండాలి.
3. యంత్ర గాయత్రి లేదా భూతలిపి సిద్ధి పొందియుండాలి.
4. నైతిక జీవనం పవిత్రంగా ఉండాలి.
5. ఉపకార స్వభావం - వాక్ శుద్ధి ఉండాలి.
6. పరాన్న భోజనం, పరద్రవ్యం ఉచితంగా గ్రహించటం, పరద్రోహ చింతన, పరగృహావాసం, దానములు పుచ్చుకోవటం, తద్దిన భోజనం చేయటం చేయరాదు.
No comments:
Post a Comment