చండీ యంత్రం (కామరాజ తంత్రే)
దుర్గాదేవికే మరో పేరు చండి. ఈమెకు అనేక విధములైన యంత్రములున్నవి. భక్తులు కోర్కెలు తీర్చడంలో అన్ని యంత్రములు సమర్థములైనవే. ఈ క్రింది యంత్రం సరళమై, సులభమై, త్వరితముగా ఫలితమిచ్చును. దీనిని రాగి రేకుపై గాని, భూర్జపత్రంపై గాని ఒక శుభ దినిన లిఖించి దానిపై దుర్గాదేవి పటమును ఉంచి పంచోపచార పూజ గావించి అనంతరం ధ్యాన స్తోత్రం చేసి జపం చేస్తే మంచిది.
ధ్యానం
"అక్షస్రక్ పరశుంగ దేఘ కులిశం పద్మం ధనుష్కుండికాం
దండం శక్తి మసించ చర్మ జలజం ఘంటా సురాభాజనం
శూలం పాశ సుదర్శనంచ దధతీ హస్తైప్రసన్నాననాం
సేవై సైరిభమర్దినీ మిహ మహలక్ష్మీం సరోజస్థితామ్"
రక్త చందనమాలగాని, పగడముల మాలతో గాని చండీ మూల మంత్రాన్ని జపించాలి. రుద్రాక్ష మాలతో కూడా జపం చేయవచ్చు. ఎర్రని వస్త్రములు ధరించాలి
No comments:
Post a Comment