పితృదేవతలు అంటే మరణించిన పూర్వీకులా లేదా ఇతర దేవతలా ?.
మరణించిన పూర్వీకులంతా ఆస్థానానికి వెళతారని పూర్తిగా చెప్పలేము. వసులోకంలో, రుద్రలోకంలో,ఆదిత్య లోకంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని పితృదేవతలు అంటారు. పితృ స్థానం వసులోకం. పితామహ(తాత) స్థానం రుద్ర లోకం. ప్రపితామహ(ముత్తాత) స్థానం ఆదిత్య లోకం. ఇలా మూడు లోకాలలో ఉండేవాళ్ళందరూ కూడా పితృదేవతలు. వీళ్ళే కాకుండా బ్రహ్మయజ్ఞాంగ తర్పణలలో పితృదేవతలను, పితృపుత్రులను, పితృపౌత్రులను అలా పితృదేవతలకి సంబంధించిన వాళ్ళందరిని కూడా కొలవటం జరుగుతుంది. బ్రహ్మదేవుడు వాళ్ళకి ఒక స్థానం కల్పించాడు. చనిపోయిన వాళ్ళందరూ అక్కడకే వెళతారని చెప్పలేము. చనిపోయిన వారికి అంత్యేష్ఠి కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించబడితే వాళ్ళకి అటువంటి ఉత్తమగతులు వస్తాయి. అంత్యేష్ఠి కార్యక్రమాలు అలా సక్రమంగా నిర్వర్తించబడకపోతే అటువంటి జీవులు ఊర్థ్వలోకాలకు కాకుండా అథోలోకాల క్రింద అట్టడుగు లోకాలకు (ప్రేతలోకాలు) వెళ్ళిపోతారు చనిపోయిన వాళ్ళకి అంత్యేష్ఠి కార్యక్రమాలు నిర్వర్తించడం మనకి మరణించిన వాళ్ళకి మంచిది కాబట్టి ఈమహాలయపక్షాల ద్వారా కూడా వాళ్ళకి సరైన తృప్తి కలిగించడం మహాలయపక్షం ఒక మంచి అవకాశం. మహాలయపక్షాలలో ఒక పూట భోజనం పెట్టడం వల్ల వాళ్ళకి శ్రాద్ధం పెట్టడం వల్ల సంవత్సరమంతా చేసిన ఫలితం వస్తుంది. అంత విశిష్టమైనది మహాలయపక్షం వీటిని పితృదినాలు అంటారు.
No comments:
Post a Comment