మహాలయపక్ష ప్రాముఖ్యత ఏమిటి ?
భాద్రపద మాసంలోని బహుళపక్షం అంతా మహాలయ పక్షంగా చెప్పబడింది.ఈ మహాలయ పక్షం ఎలా ఏర్పడింది అంటే ఒకప్పుడు దేవదానవుల సంగ్రామం జరిగి చాలా మంది హతులయ్యారు. అందులో యతీంద్రులు(సన్యాసులు) కూడా హతులయ్యారు. వాళ్ళందరికోసం పితృ విధులు నిర్వహించిన కాలం కాబట్టి యతిమహాలయం అని కూడా అంటారు. అలాగే శష్త్రహత మహాలయం అనికూడా అంటారు. అంటే రాక్షసులు వల్ల దేవతలు చాలా పీడింపబడ్డారు. కొట్టబడ్డారు చంపబడ్డారు. ఈయుద్ధంలో రాక్షసులు విజయం సాదించి దేవతలు చాలా మంది చంపబడ్డారు. అలా మరణించిన వాళ్ళందరి గురించి చేయబడ్డ విధులు కాబట్టి ఇది మహాలయంగా ప్రత్యేకించి పితృదేవతలకు ఇష్టమైనటువంటి కాలంగా నిర్ణయింపబడినది.ఇది ఆనాడు జరిగినప్పటికీ కూడా శాశ్వతంగా ఎవరి పితృదేవతలకు వాళ్ళు ఈరోజుల్లో పితృకార్యాలు నిర్వర్తించుకోవాలని, పితృదేవతలను తృప్తిపరుచుకోవాలని అటువంటి పితృదేవతలు ఈ భాద్రపద మాసంలో వచ్చినవాళ్ళు ఆశ్వీయుజ మాసం చివరలో వచ్చే అమావాస్యనాడు వెళ్ళిపోతారని చెప్పి చెప్పబడింది. అందుకే దీపావళి నాడు కొరువులు, కొరకచ్చులు ఆకాశానికి చూపిస్తారు. అలా చూపించడం ఎందుకంటే ఈ మహాలయపక్షం గురించి వచ్చిన పితృ దేవతలకు దారి చూపించడం అని పరమార్ధంగా చెప్పుతారు. అలా ఈమహాలయపక్షం పితృదేవతలకు ఇష్టమైన కాలం. దేవతలకంటే కూడా పితృదేవతలు చాలా గొప్పగా అనుగ్రహించేవాళ్ళగా చెప్పబడింది. ఒక విధంగా దేవతలకంటే కూడా పితృదేవతల యెక్క నియమాలు ఎక్కువ.దేవకార్యం కంటే పితృకార్యాలు గొప్పవని కూడా చెప్పబడింది. పితృలోకం బ్రహ్మ,విష్ణు, మహేశ్వర లోకాలకంటే పైన ఉంటుంది.
No comments:
Post a Comment