మహాలయపక్షం ఆచరించే విధానం ఏమిటి ?.
ఈ మహాలయపక్షంలో పాడ్యమి, విదియ, తదియ ఇలా 15 తిథులు ఉంటాయి వాళ్ళ తండ్రి గారు ఏతిథి(ఏమాసంలోనైనా సరే) నాడు మరణించారో భాద్రపద మాసంలో బహుళ పక్షంలో ఆతిథి నాడు వీళ్ళకి మహాలయం పెట్టాలి. ఉదాహరణకు కార్తీకమాసంలో బహుళపక్షంలో పంచమి నాడు వాళ్ళ తండ్రి చనిపోయారనుకొండి మహాలయపక్షాలలో వచ్చే పంచమి తిథి నాడు వాళ్ళ తండ్రికి మహాలయం పెట్టాలి. తల్లితండ్రులలో తండ్రికి పిండం పెడితే తల్లికి పెట్టినట్టే. అలా కాక తల్లి మాత్రమే చనిపోతే ఆతల్లికి పెట్టాల్సివచ్చినప్పుడు ఆవిడ ఏతిథి నాడు మరణించిని భాద్రపద బహుళ నవమి తిథి నాడు పెట్టాలి. నవమి మరచిపోయినా తల్లితండ్రులు మరణించిన తిథి తెలియకపోయిన భాద్రపద అమావాస్య నాడు పిండం పెట్టాలి. అలా పెట్టేటప్పుడు తీర్థ, శ్రాద్దములా పెట్టాలి అని శాష్త్రం చెప్పింది. అంటే ఆవాహానం, ద్విజాంగుష్ట నివేదనం వంటివి చేయాలి
No comments:
Post a Comment