లక్ష్మీ దేవి వ్రతం అథవా లక్ష్మీ పంచమి వ్రత విధానం
చైత్ర శుక్లపంచమినాడు నియమ నిష్ఠలతో ప్రాతఃకాలం నుంచి విధి విధానాలాచరించి గృహాన్ని పసుపు, కుంకుమలతో, పూలతో అలంకరించి ముగ్గులు వేయాలి. ఒక పీఠపై అష్టదళ పద్మం వేసి శ్రీ మహాలక్ష్మిని ప్రతిష్ఠించాలి. పసుపు పచ్చని ఆసనంపై కూర్చుని ఆవునెయ్యి దీపం వెలిగించాలి. అమ్మవారిని పంచామృతం, గులాబీ జలంతో అభిషేకం చేయాలి. ఎర్రచందనం శ్రేష్టం. తులసి నిషేదం. పరిమళభరితమైన పూలతో పూజ మంచిది. బిల్వపత్రాలను నీటిలో ఉంచి లక్ష్మీ దేవి నామాలు పఠిస్తూ
"మమ గృహే అలక్ష్మీ విధ్వంశాయ దశవిధలక్ష్మీః ప్రాప్తయే లక్ష్మీ పూజాం కరిష్యే" అంటూ లక్ష్మీ దేవిని తామరపూలతో పూజించాలి.
ఆహారంలో ఉల్లి వెల్లుల్లి వాడకూడదు. పూజ సమయంలో లక్ష్మీ దేవిని ధ్యానిస్తూ, శ్రీవిష్ణు భగవానుని స్మరిస్తూ గోత్రనామాలు చెప్పుకుని లక్ష్మీ దేవి కటాక్షం కొరకు అని ఉద్దేశ్యం చెప్పి నీటిని పాత్రలో వదలాలి.
మట్టి పాత్రలో కొబ్బరికాయ, కర్పూరంతో ఎనిమిది లేదా ఇరవై ఎనిమిది లేదా 108 సార్లు ఆహుతి ఇవ్వాలి. పూజానంతరం బ్రాహ్మణునికి నూతన వస్త్రాలు, అన్నప్రసాదాలు పెట్టాలి. అనంతరం భోజనం చేసేటప్పుడు మొదట పాయసం తిని తరువాత తక్కిన పదార్థాలు తీసుకోవాలి.
లక్ష్మీ పంచమి వ్రతం ఆచరించిన వారికి దారిద్య్రం తొలగి సకల సంపదల అభివృద్ధి కలుగుతుంది.
all copyrights reserved 2012 digital media act
No comments:
Post a Comment