క్షురకర్మ(hair cutting) గోర్లు కత్తిరించుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు
సేకరణ 【విష్ణు పురాణం, స్కంద పురాణం】
★ గోర్లు, క్షురకర్మ (హెయిర్ కటింగ్) మంగళ వారం, శుక్రవారం తీసుకోకూడదు.
★ ఇంట్లో శుభకార్యాలు, అశభ కార్యాలు, పితృకార్యాలు ఉన్న రోజున తీసుకోకూడదు.
★ అమావాస్య, పూర్ణిమ, అష్టమి, చతుర్దశి, తిథులలో మరియు పండగ సమయాలలో తీసుకోకూడదు.
★ మిగిలిన సమయాలలో సూర్యోదయానికి ముందే, స్నానానికి ముందే తూర్పువైపు తిరిగి కూర్చుని ఇంటి బయట తీసుకోవాలి.
★ తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చుని గోర్లు కటింగ్ లేదా క్షురకర్మ చేసుకోవాలి
★ తీసిన వాటిని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఎవరూ తొక్కని చోట మట్టిలో కలిసిపోయే చోట వేయాలి.
★ మన గోర్లు, వెంట్రుకలు మన శత్రువులకు దొరికితే ఏమైనా క్షుద్ర విద్యలు (చెడుపు, బాణామతి, చిల్లంగి) చేయవచ్చు
★ మనిషి ఏమి తిన్నా జీర్ణం అవుతుంది కాని వెంట్రుకలు, గోర్లు మాత్రం జీర్ణంకావు,
★ గోర్లు పెంచకూడదు. గోర్లతో చెట్ల ఆకులు, కాయలు గిల్లడం, కోయడం, మనుషులను రక్కడం చేయకూడదు
★ గోర్లు, వెంట్రుకలు మన శరీరంలోని చనిపోయిన మృత కణజాలం ఆధారంగా పెరుగుతాయి.
★ అంటే కాక మనుషులు చేసిన ప్రతీ పాపకర్మ తల వెంట్రుకలను, గోర్లను అంటి పెట్టుకుని ఉంటాయి
★ మంగళ వారానికి అధిపతి కుజుడు, పాప గ్రహాలలో అత్యంత ప్రమాదకరమైన గ్రహం. యుద్దాలకు, రక్తపాతానికి, ప్రమాదాలకు, అపార జననష్టానికి కారకుడు. గడ్డి పోచను కూడా మహా ఆయుధంగా ప్రయోగించగలడు.
★ అందుకే మరీ ముఖ్యంగా మంగళవారం గోర్లు తీసుకోవడం, హెయిర్ కటింగ్ శాస్త్రం నిషేధించింది.
No comments:
Post a Comment