దెయ్యాల గురించి ఎవరికీ తెలియని విషయాలు
దెయ్యాలు భూత ప్రేత పిశాచాల స్వరూపం స్వభావం
1. దెయ్యాలు చీకటిలోనూ వెలుతురులోనూ సమానంగా చూడగలుగుతాయి.
2. ఇవి ఎక్కువగా దట్టమైన చీకటిలోనూ మిట్టమద్యాహ్నం వేళ తిరుగుతుంటాయి.
3. నీఛ స్వభావంగల దెయ్యాలు ఎంత నీచమైన పదర్థాలైనా తింటాయి. ఉత్తమ స్వభావంగల దెయ్యాలు సాత్విక పదార్థాలనే ఇష్టపడుతుంటాయి.
4. సాధారణంగా దెయ్యాలన్నీ అహంకారం ప్రధానంగా కలిగి ఉంటాయి. మోసం చేస్తుంటాయి. వీటిని నమ్మడానికి వీలు పడదు.
5. దెయ్యాలు సెకనుకు 500 మైళ్ళ నుంచి 2000 మైళ్ళు ప్రయాణించగలవు.
6. దెయ్యాలకు పాదాలుంటాయి. కానీ అవి ఎగురుతాయి తప్ప పరిగెత్తవు.
7. ఇతర ప్రాణులకంటే దెయ్యాలలో కోపం, అహంకారం ఎక్కువగా ఉంటాయి. ఈసంగతి ఎవరికైనా దెయ్యం పట్టినపుడు వారి ప్రవర్తనను బట్టి గమనించవచ్చు.
8. దెయ్యాలు తన తీరని కోరికలు తీర్చుకొనేందుకు మరియు ఎవరిమీదనైనా పగ ఉంటే వాటిని తీర్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడవు.
9. దెయ్యాలు రాళ్ళు, మరియు మిగతా వస్తువులు తెచ్చేటప్పుడు విశ్వశక్తిని ఆధారంగా చేసుకుంటాయి. ఆశక్తితో అవి ఎక్కడెక్కడ వస్తువులో తెచ్చి ఒకచోటి నుండి మరొక చోటుకు తెచ్చేటప్పుడు వాటి రూపాలను మాయం చేసి ఆచోట్లో పెట్టేటప్పుడు రూపం వచ్చేటట్లు చేస్తున్నాయి.
10. దెయ్యాలు కూడా ఎన్నో బాధలు అనుభవిస్తూ, ఎంతెంతో పరితపిస్తూ పరులను బాధపెట్టుతూ ఉంటాయి. వీటి శరీరాలు వాయు శరీరాలు. ఇవన్నీ ఒకేవిధంగా ఉండవు.
11. దెయ్యాలలో కూడా విభిన్న జాతులు ఉంటాయి. కొన్ని మంచి దెయ్యాలు ఉంటాయి. కొన్ని చెడ్డ దెయ్యాలు ఉంటాయి. కొన్ని శక్తివంతమైనవి ఉంటే కొన్ని అంత శక్తిలేనివి ఉంటాయి.
12. తామసిక గుణం ప్రధానంగా గల దెయ్యాలు ఎప్పుడూ కోపావేశంలో ప్రవేశిస్తుంటాయి. సాత్విక దెయ్యాలు కొన్ని ఉంటాయి.
13. దెయ్యాలకి కూడా మనలాగే ఆకారం, స్వభావం ఉంటాయి. వాటిలో రాగద్వేషాలు, స్వపర బేధాలు, మమకారాలు ఉండటం లేకపోవటం ఇట్లా వాటి స్వభావాన్ని అనుసరించి మంచి చేస్తుంతాయి. చెడు చేస్తుంటాయి.
14. అవి అశాంతితో ఉంటాయి. పురాణాల్లో మతగ్రంథాల్లో భూత ప్రేత విషయాలెన్నో ఉన్నాయి.
15. దెయ్యాలు మాట్లాడుతాయి. కాని మనం వాటిని వినలేము.
16. దెయ్యాలను చూసే శక్తి, వాటి మాటలు వినే శక్తి గల వ్యక్తులు అరుదుగా ఉంటారు.
దెయ్యాలు కలిగించే కష్టాలు
1. దెయ్యాలకు ఎవరైనా నచ్చకపోతే వారిపైనా వారినివాసాలపైనా పగ పెంచుకుని మట్టిబెడ్డలు రాళ్ళు విసురుతాయి.
2. ఇంటిలోని వస్తువులు పాడుచేస్తాయి. భోజన పదార్థాలలో అసహ్యకర వస్తువులు తెచ్చి కలుపుతుంటాయి
ఎవరు దెయ్యాలుగా మారతారు
ప్రపంచంలో ఉంటూ భూతాలను, దెయ్యాలను పూజించేవారు, తామసిక ఆహర పానీయాలు సేవించేవారు, దురాచారాన్ని పాటించేవారు, హత్యలు దొంగతనాలు వంటి చేయరాని పనులు చేసేవారు, ఆత్మహత్య చేసుకున్నవారు, అకాల మరణం చెందినవారు, హత్య చేయబడి మరణించిన వారు, అంతులేని కోపం, కోరిక, పగతో మరణించినవారు, సరైన దహన సంస్కారాలు శ్రాద్ధ కర్మలు పొందని వారు దెయ్యాలుగా మారుతారు.
దెయ్యాలు పట్టిన వారి ప్రవర్తన
నిద్రలో మైమరచి ఉన్నప్పుడు గాని, మేల్కోన్నప్పుడు గాని దేవతల గుంపు చూస్తే వారికి దేవతా పిశాచం పట్టినట్లు అర్థం ఈసమయంలో బాధితుడు వివశుడై పిచ్చి ప్రేలాపనలు చేస్తాడు.


No comments:
Post a Comment