మీచుట్టూ దెయ్యాలు ఉన్నాయి అనడానికి కొన్ని సంకేతాలు
* మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లు మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్లు మీకు నిరంతరం అనిపించడం.
* పాత భవనాలు మరియు దెయ్యాలు ఉంటాయని చెప్పుకుంటున్న ప్రదేశాలలో ఉన్నప్పుడు మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలులో ఉన్నట్లుండి బ్యాటరీలు అయిపోవడం పనిచేయక పోవడం.
* రోజూ ఒకే సమయానికి అశాంతితో ఉండడం.
* ఎవరివో పాదాల అడుగులు పడుతున్నట్టు శబ్దాలు మీకు మాత్రమే వినిపించడం. ఎవరు లేకపోయినా మెట్లు ఎక్కుతున్నట్లు, దిగుతున్నట్లు, నడుస్తున్నట్లు శబ్దాలు వినిపించడం.
* ఎవరూ లేకపోయినా తలుపులపై ఎవరో కొడుతున్నట్టు శబ్దం రావడం, వంటింట్లో ఏవేవో శబ్దాలు వినిపించడం.
* మీ దగ్గరలో ఉండే కుక్క లేదా పిల్లి ఎక్కడో చూస్తూ గట్టిగా అరవటం. (దుష్టశక్తులు కొన్ని జంతువులకు చాలా స్పష్టంగా కనబడతాయి)
* వస్తువులు వాటంతట అవి కదలడం మీరు ఒక దగ్గర పెట్టిన వస్తువు అక్కడ కాకుండా వేరొక ప్రదేశంలో ఉండడం.
* ఉన్నట్టుండి భయంకరమైన దుర్వాసన రావడం (దెయ్యాలు తమ ఉనికిని తెలియజేయటానికి దుర్వాసన వెదజల్లుతాయి)
* మీ వెనకాల ఎవరో ఉన్నట్లు, మీ భుజాలు ఎవరో లాగుతున్నట్లు, మీ జుట్టు లాగుతున్నట్లు మీకు అనిపించడం.
* మీకు మాత్రమే వినిపించేటట్లు ఎవరో పెద్దగా ఏడుస్తున్నట్లు శబ్దాలు వినిపించడం.
*మీరు అద్దం ముందు ఉన్నప్పుడు మీ వెనకాల ఏవేవో నీడలు గాలులు వెళుతున్నట్టు అద్దంలో మీకు కనబడటం. అద్దంలో ఏవేవో ప్రతిబింబాలు కనబడటం
*మీ ఇంట్లో డైనింగ్ టేబులుపై గానీ, గోడలపై గానీ వస్తువులపై గానీ మీకు తెలియని చేతి గుర్తులు కనిపించటం.
* ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు బల్బులు వాటంతట అవి వెలగడం, ఆరిపోవడం, ఫ్యాన్స్ వాటంతట అవి తిరగడం.
* మీరు బుక్స్, పేపర్ చదువుతున్నప్పుడు మీ చేతిపై గాని నుదురుపై గానీ ఎవరో గాలి ఊదుతున్నట్లు అనిపించడం లేదా చదువుతున్నపుడు మీ కంటి చివర నుండి ఏదో నీడగా వెళుతున్నట్టు కనబడటం.
*అకారణంగా మీ శరీరంపై వెంట్రుకలు ఒక్కసారిగా నిక్కబొడవడం(నిలబడటం).
* మీరు పడుకున్నప్పుడు మీరు కప్పుకున్న దుప్పటి ఎవరో మెల్లగా లాగుతున్నట్లు అనిపించడం.
* మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో కౌగిలించుకున్నట్లు, మీ చేతులు కాళ్ళు పట్టుకున్నట్లు మీకు అనిపించడం.
* మీరుండే చోట అకస్మాత్తుగా టెంపరేచర్(ఉష్ణోగ్రత) తగ్గిపోవడం లేదా పెరిగిపోవడం.
* తాజాగా ఉన్న పాలు, పెరుగు, పండ్లు ఉన్నట్లుండి పాడైపోవడం
* మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ గొంతు ఎవరో నొక్కుతున్నట్లు అనిపించడం.
* మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు కూడా మిమ్మల్ని ఎవరో మీపేరు పెట్టి పిలుస్తున్నట్లు వినబడటం
Written by drive330
No comments:
Post a Comment