అఖండ ద్వాదశీ వ్రతం
ఈ వ్రతాన్ని బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇలా వివరించాడు.
హే మునులారా ఇప్పడు మోక్ష, శాంతి ప్రదమైన అఖండ ద్వాదశీ వ్రతాన్ని వివరిస్తాను వినండి.
మార్గశిర శుద్ద ద్వాదశి నాడు ఆవుపాలు, పెరుగును మాత్రమే భోజనంగా స్వీకరించి జగన్నాథుడైన విష్ణువును పూజించాలి. నాలుగు నెలలపాటు అనగా ఫాల్గుణ మాసం వరకూ ప్రతీ ద్వాదశి నాడు చేసి చివరగా ఐదు రకాల ధాన్యాలను ఐదు పాత్రలలో నింపి బ్రాహ్మణునికి దానం చేసి క్రింది విధంగా చెప్పాలి
"సప్త జన్మనిహేవిష్ణో యన్మయా హి వ్రతం కృతం
భగవంస్త్వ ప్రసాదేన తదఖండ మిహస్తు మే
యదాఖండం జగత్సర్వం త్వమేవ పురుషోత్తమ
తథాఖిలాస్య ఖండాని వ్రతాని మమ సంతువై"
ఇలా తాను ఏడు జన్మలలో చేసే ప్రతీ పుణ్య కర్మఫలాన్ని అఖండం చేయమని దేవుడిని ప్రార్దిస్తూ చైత్రాది నాలుగు మాసాల్లో సక్తుపిండి(పేలాల పిండి)తో నింపిన పాత్రలను శ్రావణాది నాలుగు మాసాలలో నేతితో నింపిన పాత్రలను బ్రాహ్మణునికి దానం చేయాలి.
సామర్థ్యం లేనివారు సంవత్సరంలో మూడు మార్లే దానం చేయవచ్చు.
ఈవిధంగా ఒక సంవత్సరం పాటు ఈవ్రతాన్ని ఆచరించిన వారికి ఉత్తమ స్త్రీ, మంచి కొడుకులు లభిస్తారు. మరణ కాలంలో స్వర్గానికి చేరతారు.
No comments:
Post a Comment