పాపాలు తొలగించడానికి మార్గాలు
1. సంయత చిత్తులై తీర్థస్నానాలు చేస్తూ వ్రతాలు ఆచరిస్తూ బ్రాహ్మణులకు దానాలిస్తూ జీవించేవారు సర్వపాప విముక్తులై ఉత్తమ గతిని పొందుతారు.
2. పతివ్రతయై పతిసేవా శుశ్రూషులతో ఉండే స్త్రీ ని ఎటువంటి పాపములు అంటవు. పతివ్రతయైన స్త్రీ కి ఎటువంటి పాపములు అంటవు.
3. సూర్యచంద్ర గ్రహణ సమయాలలో మంత్రజపం, తపస్సు, తీర్థసేవనం, దేవార్చన, బ్రాహ్మణ పూజ, వీటిలో ఏది జీవితాంతం చేసినా వారి పాపాలన్నీ తొలగుతాయి.
4. ఎన్ని పాపాలు చేసినవాడైనా పశ్చాత్తాపపడి పుణ్యతీర్థంలోకి పొయి నియమబధ్దంగా జీవనం సాగిస్తూ ప్రాణత్యాగం చేస్తే వానిపాపాలన్నీ నశిస్తాయి.
5. ప్రతీ శుద్ధ ఏకాదశి నాడు నిరాహరంగా ఉండి ద్వాదశి నాడు విష్ణు భగవానుని ఆరాదిస్తే ఒక సంవత్సరంలో వారి పాపాలన్నీ నశిస్తాయి.
6. కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఉపవాసం ఉండి సప్తమి నాడు సూర్యభగవానుడుని పూజిస్తే ఎన్నో పాపాలు నశిస్తాయి.
7. ప్రతీ కృష్ణ చతుర్దశి నాడు ఒక సంవత్సరంపాటు ఉపవాసం ఉండి ప్రశాంత చిత్తుడై పవిత్ర నదిలో స్నానం చేసి ఓంకార యుక్తంగా యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వత, కాల, సర్వ భూతక్షయ నామ మంత్రాలను ఉచ్చరిస్తూ ఒక్కొక్క మంత్రానికి ఏడేసి తిలలతో జలాంజలులతో కూడిన తర్పణలివ్వడం వల్ల ప్రజలు సమస్త పాపములు తొలగించుకోవచ్చు.
8. గయ, కాశి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు దర్శించడం, ప్రతి అమవాస్యనాడు శంకర భగవానుని పూజించడం, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడం ఇటువంటి పనులు చేయడం వల్ల పాపాలను తొలగించుకోవచ్చు.
No comments:
Post a Comment