జ్వరం (జ్వర పురుషుడు) ఎలా పుట్టిందో తెలుసా
శివుడు దక్షయజ్ఞం విధ్వంసం చేయడానికి పూనుకున్న సమయంలో శివుడి నుదురు నుండి ఒక చెమట బిందువు భూమిపై పడింది వెంటనే అక్కడ పెద్ద మంటలు వచ్చాయి. ఆమంటల్లో ఎర్రని నేత్రాలు, నల్లని రూపు, పైకి నిక్కపొడుస్తున్న పొడవైన కేశములతో భయంకరమైన ఆకృతిలో ఒక పురుషుడు ఆవిర్భవించాడు. అతను ఆవిర్భవించగానే దేవతలు, ఋషులు భయంతో నలుదిక్కులా పారిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి శివున్ని చూసి వినయ విధేయతలతో నమస్కరిస్తూ దేవతలు నీకు యజ్ఞంలో భక్తితో భాగం కల్పిస్తారు స్వామి కోపం వదులు. బ్రహ్మ అలా అనగానే శివుడు దయతో మందహసం చేస్తూ మునులను దేవతలను అనుగ్రహించాడు. వారు శివుడికి యజ్ఞంలో భాగం కల్పించారు.
బ్రహ్మదేవుడు శివుడితో దేవా నీ నుదురు చెమట నుండి పుట్టిన పురుషుడు జ్వరం అనే పేరుతో ప్రసిద్దుడు అవుతాడు. అతడు సర్వత్రా సంచరిస్తాడు. ఈ జ్వరం ఒకచోటే ఉంటే భూమి భరించలేదు అందువలన దానిని నానా రూపాలుగా సృష్టించు అన్నాడు. అప్పుడు శివుడు ఆ జ్వరాన్ని ఏనుగులకు తలనొప్పిగా, పాములకు కుబుసంగా, చిలకలకు వెక్కిళ్ళుగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్లకు తమరూపు చూసేడానికి ఆటంకంగా, గుర్రాలకు పార్శ్వభాగంలో శోషణంగా, నెమళ్ళకు ఈకలు ఊడిపోవటంగా, కోకిలలకు నేత్ర వ్యాధిగా, మేకలకు మనోభ్రాంతిగా, పులులకు శ్రమగా, మానవులకు చావు,పుట్టుకలు మొదలైన సందర్భాలలో కలిగే దుఃఖంగా విభజించాడు. ఇదీ జ్వర స్వరూపం జ్వరం శివ స్వరూపం అందువల్ల జ్వరం అందరికీ నమస్కరింపదగినది.
సేకరణ : మహభారతం (శాంతిపర్వం)
No comments:
Post a Comment