రజస్వల(పీరియడ్స్) అయిన సమయంలో స్త్రీతో సంభోగం నేరమా
సేకరణ (బ్రహ్మ వైవర్త పురాణం)
రజస్వల అయిన స్త్రీ తో మొదటి దినమున సంభోగం చేసిన బ్రహ్మహత్యాపాపంలో నాల్గవభాగం సంక్రమిస్తుంది. ఆపురుషుడు దేవకార్యాలకు, పితృకార్యాలకు అనర్హుడు. వారు అథములై, నిందితులై అపశ్రేయస్సును పొందుతారు
రెండవ దినమున సంభోగించిన గోహత్యాపాపమును పొందగలడు. అటువంటి వారు జీవిత పర్యంతం దేవ, పితృ, బ్రాహ్మణ పూజార్హతను కోల్పోతారు. వారు మనుష్యత్వం నుండి దిగజారి కళంకితులగుతారు.
మూడవ దినమున సంభోగించిన మూఢులై భ్రూణహత్యాపాపానికి గురవుతారు. వీరు పతితులై సత్కార్యాలకు అనర్హులవుతారు.
నాల్గవదినమున రజస్వల స్త్రీని అసత్ శూద్ర అంటారు కావున స్త్రీని నాల్గవ దినమున తాకరాదు.
ప్రధమ దినమున రజస్వలా స్త్రీని చండాలినిగ భావింపాలి.
రెండవ దినమున మ్లేచ్చురాలిగా
మూడవ దినమున రజక(చాకలి) స్త్రీగా భావించాలి
నాల్గవ దినమున ఆమె పతికొరకు శుద్దురాలగును. కానీ దేవ పితృకార్యాలు చేయుటకు శుద్దురాలు కాదు.
No comments:
Post a Comment