హనుమంతుడు జన్మించింది ఆంధ్ర దేశం లోనా
హనుమంతుడి జననం గురించి రకరకాల వాదనలు ఉన్నాయి . కొందరు బళ్ళారిలో పుట్టాడని, కొందరు జార్ఖండ్ ప్రాంతంలో పుట్టాడని, కొందరు ఇంకెక్కడో పుట్టాడని అంటుంటారు. కానీ వీటికి ఎటువంటి శాస్త్రాధారం లేదు.
నిజానికి హనుమంతుడు ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో అంజనాద్రిపై జన్మించాడు . దీనికి వివిధ పురాణాలలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.
ఆంజనేయుని జననం గురించి వివరించే సంఘటన బ్రహ్మాణ్డ పురాణంలో ఇలా ఉంది.
మతంగ మహముని అంజనేయుని తల్లి అయిన అంజనా దేవితో ఇలా అన్నాడు
" అంజనే త్వంహి శేషాద్రౌ తపస్త్వత్వా సుతారుణౌ
పుత్రం సూతవతీ యస్మాత్ లోకత్రయ హితాయ వై"
ఓ అంజనా ముల్లోకాల క్షేమంకోసం నువ్వు ఈ శేషాద్రిపై ఈపుత్రుడికి జన్మనిచ్చావు కాబట్టి ఇక నుండి ఈ భాగం అంజనాద్రి అని పిలవబడుతుంది అని వరమిచ్చాడు.
ఆంజనేయుడు జన్మించిన ప్రదేశం ఆకాశగంగ తీర్థానికి అభిముఖంగా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయుడు విగ్రహ రూపంలో స్వయంభువుగా వెలిసాడు.అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశంలోనే తదనంతర కాలంలో జాబాలి(జాపాలి)మహర్షి కూడా ఇక్కడే తపస్సు చేసాడు.
No comments:
Post a Comment