కలలో ఆదిశేషువు కనబడితే అర్థమేమిటి.
జ). నిజంగా కలో కనబడినది ఆదిశేషువే అయితే అది పరమార్థమే. అది చాలా మంచిదే అందులోనే శ్రీమహావిష్ణువు దర్శనం కూడా అయితే ఇంకా మంచిది. కేవలం పాము కనబడి అపాము ఆదిశేశువే అనుకుంటే దానికి వేరే కారణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. స్వప్నశాష్త్రం కలలో సర్పాలు కనబడటానికి కొన్ని కారణాలు చెప్పింది. అవి
1. జాతకం ప్రకారం దశ,అంతర్దశలలో రాహువు కాని కేతువు గాని ప్రవేశించిన అవి సర్పగ్రహాలు కాబట్టి కలలో నాగ దర్శనం అవుతుంది
2. గతజన్మ అనుభవాలు కూడా కొన్ని స్వప్నంలో అనుభవానికి వస్తాయి ఆకలలు ఎలా ఉంటాయి అంటే కొందరికి ఒక పాడుబడ్డ గృహం లేదా భవనం పదేపదే అదే కలలో కనబడుతుంది ఆప్రదేశాన్ని వాళ్ళు ఇంతకు ముందు చూసి ఉండకపోవచ్చు కాని గతజన్మలో చూసి ఉండవచ్చు.
3. గతజన్మలో సర్పం వల్ల భయపడినటువంటి పరిస్థితి గానీ సర్పం కాటువేయడం వల్ల మరణించినటువంటి పరిస్థితి ఉంటే ఇలాంటి అనుభవాలు స్వప్నంలో కనబడుతుంటాయి.
4. నాగదోషం ఉన్నటువంటి వారికి కూడా తరచుగా కలలో సర్పాలు కనబడతాయి.
5. సర్పాలు వల్ల భయపడి ఉంటే తరచుగా కలలో సర్పాలు కనబడతాయి.
మీకు నిజంగా కలలో కనబడినది ఆదిశేశువే అయితే అది దేవతా సర్పం కాబట్టి దైవం కలలో కనబడితే ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం మీకు కలుగుతుంది.
దీనివల్ల సంతానం లేనివారయితే త్వరలో సంతానం కలుగుతుంది. అని భావన చేయవచ్చు.
No comments:
Post a Comment