అక్షౌహిణి అంటే ఎంత సైన్యం
జ). ఒకరథం ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదు కాలిబంట్లు గల సేనని "పత్తి" అంటారు.
పత్తి = 1రథం+1ఏనుగు+3గుర్రాలు+5కాలిబంట్లు
పత్తిని మూడు సంఖ్యతో గుణిస్తే వచ్చే సేనని "సేనాముఖం" అంటారు.
సేనాముఖం = ౩రథాలు+3ఏనుగులు+9గుర్రాలు+15 కాలిబంట్లు
సేనాముఖానికి మూడు సంఖ్యతో గుణిస్తే వచ్చే సేనని "గుల్మం" అంటారు.
గుల్మం = 9రథాలు+9ఏనుగులు+27గుర్రాలు+45కాలిబంట్లు
గుల్మానికి మూడు రెట్లు సేనని "గణం " అంటారు.
గణం = 27రథాలు+27ఏనుగులు+81గుర్రాలు+135కాలిబంట్లు
గణానికి మూడు రెట్లు సేనని "వాహిని" అంటారు.
వాహిని = 81రథాలు+81ఏనుగులు+243గుర్రాలు+405కాలిబంట్లు
వాహినికి మూడు రెట్లు సేనని "పృతన" అంటారు.
పృతన = 243రథాలు+243ఏనుగులు+729గుర్రాలు+1215కాలిబంట్లు
పృతనకి మూడు రెట్లు సేనని "చమువు" అంటారు.
చమువు = 729రథాలు+729ఏనుగులు+2187గుర్రాలు+3645కాలిబంట్లు
చమువుకి మూడు రెట్లు సేనని "అనీకిని" అంటారు.
అనీకిని = 2187రథాలు+2187ఏనుగులు+6561గుర్రాలు+10935కాలిబంట్లు
అనీకినికి పది రెట్లు సేనని "అక్షౌహిణి" అంటారు.
అక్షౌహిణి = 21870రథాలు+21870ఏనుగులు+65610గుర్రాలు+109350 కాలిబంట్లు
ఇది ఒక అక్షౌహిణి సేన ఒక అక్షౌహిణిలో మనుషుల సంఖ్య
కాలిబంట్లు 109350
21870 రథాలమీద మనుషులు. 21870
21870 ఏనుగులు మీద మనుషులు. 21870
65601గుర్రాల మీద మనుషులు. 65601
మొత్తం మనుషుల సంఖ్య. 2,18,691

No comments:
Post a Comment