వ్యాధి హర వైష్ణవ కవచం (గరుడ పురాణం)
విష్ణుర్నామ గ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః
హరిర్మే రక్షతు శిరో హృదయంచ జనార్థనః (1)
మనోమమ హృశీకేశో జిహ్వం రక్షతు కేశవః
పాతు నేత్రే వాసుదేవః శ్రోత్రే సంకర్షణో విభుః (2)
ప్రద్యుమ్నః పాతుమే ఘ్రాణ మనిరుద్దస్తు చర్మచ
వనమాలాగల స్థాం తం శ్రీవత్సో రక్షతా దధః (3)
పార్శ్వం రక్షతు మే చక్రం వామం దైత్య నివారణం
దక్షిణంతు గదా దేవీ సర్వాసుర నివారిణీ (4)
ఉదరం ముసలం పాతు పృష్ఠం మే పాతులాంగలం
ఊర్థ్వం రక్షతు మేశాంగం జంఘే రక్షతు నందకః (5)
పార్ష్ణీ రక్షతు శంఖచ్చ పద్మం మే చరణావు భౌ
సర్వకార్యార్థ సిద్ధ్యర్థం పాతుమాం గరుడః సదా (6)
వారాహో రక్షతు జలే విషమేషు చ వామనః
అటవ్యాం నరసింహశ్చ సర్వతః పాతు కేశవః (7)
హిరణ్యగర్భో భగవన్ హిరణ్యం మే ప్రయచ్ఛతు
సాంఖ్యాచార్యాస్తు కపిలో ధాతు సామ్యం కరోతు మే (8)
శ్వేత ద్వీప నివాసీ చ శ్వేత ద్వీపం నయత్వజః
సర్వాన్ సూదయతాం శత్రూన్ మధుకైటభ మర్దనః (9)
సదా కర్షతు విష్ణు శ్చ కిల్బిషం మమ విగ్రహాత్
హంసో మత్స్యస్థథా కూర్మః పాతుమాం సర్వతో దిశాం (10)
త్రివిక్రమస్తు మే దేవః సర్వపాపాని కృతంతు
తథా నారాయణో దేవో బుద్ధిం పాలయతాం మమ (11)
శేషో మే నిర్మలం జ్ఞానం కరోత్వజ్ఞాన నాశనం
వడవా ముఖో నాశయతాం కల్మషం యత్కృతం మయా (12)
పద్ భ్యాం దదాతు పరమం సుఖం మూర్ద్ని మమ ప్రభుః
దత్తాత్రేయః ప్రకురుతాం సపుత్ర పశుబాంధవం (13)
సర్వానరీన్ నాశయతు రామః పరశునా మమ
రక్షోఘ్నస్తు దాశరథిః పాతు నిత్యం మహభుజః (14)
శత్రూన్ హలేన మే హన్యాద్ రామో యాదవ నందనః
ప్రలంబ కేశి చాణూర పూతనా కంస నాశనః
కృష్ణస్యయో బాలభావఃసమే కామాన్ ప్రయచ్ఛతు (15)
అంధకార తమో ఘోరం పురుషం కృష్ణ పింగళం
పశ్యామి భయ సంత్రస్తః పాశహస్త మివాంతకం (16)
తతో-హం పుండరీ కాక్షం అచ్యుతం శరణం గతః
ధన్యో-హం నిర్భయో నిత్యం యస్యమే భగవాన్ హరిః (17)
ధ్యాత్వా నారాయణం దేవం సర్వోపద్రవ నాశనం
వైష్ణవం కవచం బద్ధ్వా విచరామి మహీ తలే (18)
అప్రదృష్యో-స్మి భూతానం సర్వదేవ మయో హ్యహం
స్మరణా ద్దేవ దేవస్య విష్ణో రమిత తేజసః (19)
రాక్షసులతో పిశాచాలతో నిండిన దట్టమైన అడవులలోనైనా, అశుభ ప్రాంతాలలోనైనా, అగ్ని, చోర, గ్రహ, విద్యుత్ బాధలు, పాము కాట్లు, విఘ్న, రోగ పీడలలో , ఇతర భయంకర పరిస్థితుల్లో ఈ వైష్ణవ కవచ స్తోత్రాన్ని భక్తిపూర్వకంగా నిత్యం చదివేవారికి ఎటువంటి బాధలు కలుగవు ఇది మాలా మంత్ర స్తోత్రం కూడా
No comments:
Post a Comment