విద్వేషణ తంత్రం
మంత్రం
" ఓం నమో నారాయణాయ అముకం అముకేన సహవిద్వేషం కురుకురు స్వాహ"
1. కాకిరెక్క నొకచేత, గుడ్లగూబ ఈక నొకచేత ఉంచుకుని మంత్రమునుచ్ఛరించుచూ రెండిటిని కలిపి నల్లని దారముతో ముడివేసి కట్టి ఏడుదినముల వరకూ అంజలిలో నీటినిపట్టి తర్పణము విడుస్తూ మంత్రమును అష్టోత్తర శతం జపించుచూ చివరకు అంజలినీటితో ఆఈకలను కూడా విడిచివైచుచూ ఇటుల నిత్యము ఏడుదినములు ఆచరించిననూ
2. ఎవరికైతే విరోధము పెట్టదలుచుకున్నారో వారి అడుగు పడిన చోట మన్నును తెచ్చి సింహము జూలు వెంట్రుక, ఏనుగు రోమము, అడుగు పడినచోట మన్నును తెచ్చి దానితో కలిపి బొమ్మను చేసి గోతిలో ఉంచి పైన హోమగుండం కల్పించి మాలతీపూలతో హోమము చేసిన తప్పక ఆఇరువురికీ వైరం కలుగును
3. పిల్లి, ఎలుక వీటి మలమును కాలి క్రింద మన్నుతో కలిపి బొమ్మను చేసి నీలవస్త్రం కప్పి అభిమంత్రించినచో తండ్రి,కొడుకులకైనా వైరం కలుగుతుంది.
4. సర్పదంతము, ముంగిస రోమము కాలి బూడిదలో కలిపి ముద్దచేసి దానిని దొడ్డియందు పాతిపెట్టిన ఆఆవరణలోని వారికి తత్ క్షణమే పరస్పరం ద్వేషం అంకురించును.
5. పలువురు కూడినచోట మహాసభను, పాము కుబుసం, ముంగిస రోమము ఈరెంటినీ నిప్పుల మీద పొగ వేసి ఆపొగ పారనిచ్చిన ఎడల అక్కడున్న వారందరూ నొకరినొకరు కలహించెదరు.
6. కుక్క రోమము, పిల్లిగోరు ఈరెంటిని కలిపి దూపం వేసిననూ సభ గందరగోళమై పైరీతిన జరుగును
7. నెమలి రెట్ట, పాము కోర కలిపి నూరి తిలకముగా ధరించినవానికి మిత్రులనువారు ఉండరు.
8. ఏనుగు దంతము, సింహం దంతము కలిపి నూరి తిలకముగా ధరించిననూ పైరీతిన జరుగును.
9. గుర్రము, దున్నపోతు రోమములను కలిపి ధూపము వేసిననూ సభికులకు పరస్పరం ఆక్షణంలోనే విద్వేషణం కలుగును.
10. అందుగు చెట్టుముల్లుతో ద్వారము దగ్గర త్రవ్వి దానిని పూడ్చిపెట్టిన ఎడల ఆఆవరణలోని వారంతా ఒకరినొకరు ద్వేషింతురు.
11. ఎంత ఆప్తమిత్రులైననూ విద్వేషము కలిగింపదలచినప్పుడు ఇరువురి అడుగుల క్రింద మట్టిని తీసుకుని బొమ్మను చేసి స్మశానంలో పూడ్చిపెట్టవలయును.
No comments:
Post a Comment