ఉచ్ఛాటన తంత్రం
మంత్రం
"ఓం నమో భగవతే రుద్రాయ దంష్ట్రాకరాళాయ అముకం సపుత్రబాంధవైః సహ, హనహన, దహదహ, పచపచ, శీఘ్రమ్ ఉచ్ఛాటయ ఉచ్ఛాటయ, హుం, ఫట్ స్వాహ, ఠఃఠః"
ఈమంత్రం ఒక లక్షా 25వేలు జపించిన వారికి ఉచ్ఛాటన సిద్ధిస్తుంది.
ఎవరైననూ ధన పశు గృహ కాంతాదికములను బలాత్కారముగా హరించినచో అట్టివారిని క్రింద విదంగా పీడించవచ్చును.
1. బ్రహ్మదండి పుడకలను కాల్చిన భస్మము చితియందలి భస్మము వీనిని ఆవనూనెలో కలిపి శివలింగమునకు రాసి (దేవకాంచన పువ్వులతో కప్పి) శనివారంనాడు శత్రువు యింటి ముందు కనపడని తావున ఉంచినచో ఇక అక్కడ నుండి అక్కడ ఉన్నవాళ్ళందరికీ సమస్తమైన అరిష్టములు కలుగును. ఇది తిరుగులేని సిద్ధయోగము. శివలింగం మీది దేవకాంచనములను నూనెలోముంచిన వానిని కాని, ఆదివారం నాడు కాకిఈకలతో గాని శత్రువు గృహమందు పూడ్చిపెట్టినచో అరిష్టము కలుగును.
2. గుడ్లగూబ రెట్ట, దేవకాంచనం పూరేకులు, వెలిగారము చూర్ణము చేసి ఆచూర్ణమును ఆవనూనెలో కలిపి దేహమునకు పూసినచో దేహ మనఃస్వాస్థ్యములు తప్పిపోవును.
3. మంగళవారం నాడు గుడ్లగూబ ఈకలను తెచ్చి శతృగృహమున పూడ్చిపెట్టినచో ఆఇంటివారికి అనేక అనార్దాలు సంభవిస్తాయి.
4. మంగళవారం నాడు సుమారు నాలుగు అంగుళముల మేడివేరును మంత్రం ఉచ్ఛరించుచూ గ్రహించి తీసుకుని వచ్చి శతృగృహమున పాతిన ఉచ్ఛాటనమగును.
5. హోమము చేసి అందు కాకి, గుడ్లగూబ రెక్క ఈకలను వేల్చి, శతృనామము ఉచ్ఛరించి 108 సార్లు మంత్రము జపించిన ఉచ్ఛాటనమగును.
6. శతృగృహ ఆవరణమందు నాలుగు అంగుళముల మేర త్రవ్వి అందులో మనిషి ఎముకలను జపిస్తూ పూడ్చిపెట్టినచో ఆఇల్లు ఇక ఎన్నటికీ కోలుకోదు
No comments:
Post a Comment