శిల్పి సూక్తమ్ ( ఋగ్వేదము ).
ఓమ్ వాస్తోష్పతే ప్రతి జానీ హ్యస్మాన్ త్స్వావేశో అనమీవో భవాన యత్ త్వేమహే ప్రతి తన్నో జుషస్వ శంనో భవ ద్విపదే శం చతుష్పదే || (1)
హే వాస్తోష్పతీ! మమ్ములను నీ వారిగా ఆదరించుము. మా ఇంట రోగములు లేకుండా చేయుము. మేము కోరెడి సంపదలను మాకు ప్రసాదించుము. మా సంతానమును , పశు సంపదను వృద్ధిపరచి మాకు కళ్యాణకారివి కమ్ము.
ఓమ్ వాస్తోష్పతే ప్రతరణో న ఏధి గయస్ఫానో గోభి రశ్వేబి రింద్రో | అజరా సస్తే సఖ్యే స్యామ పితేవ పుత్రాన్ ప్రతి నో జుషస్వ || (2)
ఓ గృహ స్వామీ! నీవు మమ్ములను తరింపజేయు వాడవు. ఓ ఇంద్ర దేవా! మేము గో సంపదతోను, అశ్వ సంపదతోను సమృద్ధి పొందెదము గాక. ముసలి తనము మా దరిచేరకుండు గాక. ఒక తండ్రి తన పిల్లలను పాలించు విధమున నీవు మమ్ము పాలించుము.
ఓమ్ వాస్తోష్పతే శగ్మయా సంసదా తే సక్షీమహి రణ్వయా గాతువిత్తమా | పాహి క్షేమ ఉత యోగే వరం నో యూయం పాతు స్వస్తిభిః సదాన: || (3)
హే వాస్తోష్పతీ! వాస్తు దేవుడా ! సుఖదాయకము రమణీయము ప్రగతిశీలమునైన నీ సదనము మాకు ప్రాప్తించుగాక. ఉత్తమ స్థానమును పొంది, సభా సదస్యులమై గౌరవము పొందెదము గాక. ప్రాప్తించిన ధనమును రక్షించు కొనుట యందు, అప్రాప్తధనమును ప్రాప్తింప జేసుకొనుట యందు ఎల్లపుడూ నీ రక్షణ పొంది యుండెదముగాక.
No comments:
Post a Comment