శవసాధన shava sadhana
శవ సాధన అనేది ఒక తాంత్రిక సాధన. వివిధ రకాల ఉద్దేశ్యాల కోసం ప్రయోజనం కోసం అఘోరాలు దీనిని చేస్తారు. దీనిలో సాధకుడు శవం మీద కూర్చుని ధ్యానం చేస్తాడు. శవ సాధన అనేది వామాచార తంత్రం. ఇది రహస్యంగా చేసే తంత్ర ఆచరణ.
శవ సాధన అనేది అత్యంత ముఖ్యమైన కష్టమైన రహస్యమైన ఆచారాలలో ఒక తంత్ర విద్య. తాంత్రిక గ్రంథాలు ఈ శవసాధన ఎలా చేయాలనేది వివరించాయి
శవసాధనకు శవాన్ని ఎన్నుకోవడంలో కూడా కఠినమైన నియమాలు ఉన్నాయి.
కౌళావళి నిర్ణయ, శ్యామా రహస్య, తారాభక్తి సుధార్ణవ, నీళ తంత్ర, కుళ చూడామణి, కృష్ణానంద రచించిన తంత్రసార, కాళీ తంత్ర వంటి గ్రంథాలు శవసాధన గురించి వివరించాయి.
పార్వతీ దేవిని (కాళి, ఆదిపరాశక్తి) శవసాధన లేకుండా ఆరాదిస్తే నరకానికి వెళ్తారని కాళి తంత్రగ్రంథం చెప్తుంది
శవసాధన ఎందుకు చేస్తారుశవసాధనకు శవాన్ని ఎన్నుకోవడం
శవసాధనకు పనికిరాని శవాలు- ఆత్మహత్య చేసుకున్నవాడి శవం
- భార్యకి దాసుడిగా ఉండే వ్యక్తి ళవం
- జననేంద్రియాలు స్పష్టంగా కనిపించని శవం
- ఆకలి కరువు కారణంగా చనిపోయిన వాడి శవం
- ఆవు(హిందువుల పవిత్ర జంతువు గోమాత) శవం ఈశవాలు శవసాధనకు పనికిరావు
శవసాధన విధానం
శవ సాధన ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లక్ష్యం కోసం చేస్తారు.
మూలాథార చక్రంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పి సుషుమ్నా నాడి ద్వారా పైపైకి సహస్రాథార చక్రం వరకు తీసుకువచ్చి ఆకుండలినీ శక్తిని పరమశివుడితో కలపడం శవసాధన యొక్క లక్ష్యమని తంత్రగ్రంథాలు చెప్తున్నాయి.
శవసాధనకు శవాన్ని ఎన్నుకోవడం గురించి తంత్రశాస్త్రంలో చాలా కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి
శవం తాజాగా పాడైపోకుండా ఉండాలి
శవానికి ఎటువంటి అంగవైకల్యం ఉండకూడడు. శవంలో ఏభాగం తప్పిపోకూడడు (ఉదాహరణకి కళ్ళు లేకపోవడం, చెవులు లేకపోవడం)
శరీరంలోని అన్ని భాగాలు సరిగ్గా ఉండాలి
శవాలలో చండాల (శూద్రజాతి పురుషునికి బ్రాహ్మణ జాతి స్త్రీకి పుట్టినవారిని చండాల అంటారు) ఈ చండాల శవాన్ని తంత్రశాస్త్రంలో మహశవం అంటారు శవసాధనకు ఈచండాల శవం శ్రేష్టమైనది. అత్యంత శక్తివంతమైనది
నీటిలో మునిగి చనిపోయిన, పిడుగుపడి చనిపోయిన, కత్తితో గాని కర్రతో గాని చంపబడ్డ శవం, పాము కాటు వల్ల చనిపోయిన, శత్రువులతో పోరాడుతూ చనిపోయిన ధైర్యవంతుడైన యువకుడి శవాలను శవసాధనకు ఎన్నుకుంటారు
తంత్రసార గ్రంథంలో మహిళ శవం ఉపయోగించకూడడు అని చెప్పినా ఇప్పటికీ పచ్చిమ బెంగాల్ లో కన్య (పెళ్ళికాని మహిళ) శవాన్ని శవ సాధనకు ఉపయోగిస్తున్నారు. కన్య మృతదేహంతో సాధన చేయడ వల్ల దేవత కన్య యొక్క మృతదేహంలోకి ప్రవేశించి సాధకుడితో మాట్లాడుతుందని చెప్తారు
హిందూమత విశ్వాసాల ప్రకారం మనిషికి మరణం రెండు దశలలో ఉంటుంది అందులో ఒకటి భౌతికమరణం అనగా మనిషి ప్రాణం పోవటం రెండవది కర్మ మరణం మనిషి శవం కాలిపోతున్నప్పుడు చివరగా మనిషి కపాళం (పుర్రె) బాగా కాళి పెద్ద శబ్దంతో పేలిపోతుంది అప్పుడు చివరగా మనిషిలో ఉన్న ప్రాణం కూడా గాలిలో కలిసిపోతుంది దీనినే కపాళ క్రియ అంటారు దీని వలన అటు భౌతిక మరణానికి ఇటు కర్మమరణానికి మధ్యస్థితిలో ఉన్న శవాన్ని శవసాధనకు ఉపయోగిస్తారు. కారణం కర్మ మరణ స్థితికి కపాళభేదనం జరుగదు కనుక పుర్రెలో ప్రాణం నిలిచి ఉంటుంది
శవ సాధనకు మనిషి శవం లేనప్పుడు ఏదైనా జంతువు శవం అదీ అందుబాటులో లేకపోతే దర్భ(గడ్డి), బార్లీ, బియ్యం పిండికలిపి మనిషి బొమ్మను తయారు చేసి దానిపై కూర్చుని శవసాదన చేయవచ్చు.
ఈవిధానం కూడా సాధ్యం కానప్పుడు స్మశానంలో గుండ్రంగా ఒక వృత్తం గీచి ఆవృత్తంలో నల్ల నువ్వులు జల్లి ఆవృత్తంలో కూర్చుని శవసాధన మంత్రాన్ని పఠిస్తూ శవసాధన చేయవచ్చు.
శవసాధన చేసేవారు తాంత్రిక నియమాలు ఖచ్చితంగా పాటించాలి. నియమాల విషయంలో ఏ మాత్రం తేడా వచ్చిన ఆసాధకుడు రక్తం కక్కుకుని చావడం లేదా పిచ్చివాడవడం జరుగుతుంది
శవసాధన అనేది సాధారణంగా అమావాస్య రోజున నిర్వహిస్తారు. అలాగే ఒక పక్షంలో ఏనిమిదవ దినం(అష్టమి) లేదా పదనాల్గవదినం (చతుర్థశి) లేదా మంగళవారం ఈ సాధనకు అత్యంత శక్తివంతమైనదని తంత్రసార గ్రంథం చెప్తుంది.
శవసాధనను రాత్రి సమయంలో మాత్రమే చేస్తారు. ఈసాధనను ఎక్కువగా స్మశానవాటికలో చేస్తారు. పాడుబడిన ఇల్లు, నదీ తీరం, ఎత్తైన పర్వత ప్రదేశం, ఒంటరిగా ఉండే ప్రదేశం, యుద్దరంగం, బిల్వచెట్టు సమీపంలో కూడా చేస్తారు అయితే స్మశానవాటికలో చేసే సాధన ఖచ్చితంగా ఫలిస్తుందని అనుభవజ్ఞులైన తాంత్రికుల అభిప్రాయం.
శవసాధనలో మొదట ఒక శవాన్ని ఒక నిర్ణీత ప్రదేశంలో ఉంచి ఆశవానికి పూలతో పూజించి ఆతరువాత మంత్రాలతో భైరవుణ్ణి ఆవాహన చేసి ఆతరువాత కాళీ దేవిని ఆవాహన చేస్తారు. ఆతరువాత ఆశవాన్ని స్నానం చేయించి పులిచర్మం లేదా జింకచర్మం లేదా దర్భలతో చేసిన చాపమీద ఆశవాన్ని ఉంచుతారు. ఆతరువాత శవం యొక్క రెండు పాదాలను తాళ్ళతో కట్టి ఉంచుతారు. తరువాత శవం యొక్క శిరస్సుపై ఉండే జుట్టును ముడివేస్తారు ఇలా ఎందుకు చేస్తారంటే శవం శిరస్సులో ఉన్న ప్రాణం శిరోజాల ద్వారా బయటకు పోకుండా ఉండటానికి
ఆతరువాత సాధకుడు ఆశవంపై కూర్చుని దేవతా భీజ మంత్రాలను జపించడం ఆరంభించి తాంబూలాన్ని శవం యొక్క నోటిలో ఉంచి తరువాత శవాన్ని వెల్లకిలా పడుకోబెట్టి దానికి గంధం పూత పూస్తాడు తరువాత బోర్లా పడుకోబెట్టిన శవంపై దేవతా యంత్రం గీచి సాధకుడు ఆశవంపై కూర్చుని 64 మంది యోగినులను, అష్ట దిక్పాలకులనం పూజించి వారికి పండ్లు నైవేద్యంగా ఇస్తాడు తర్వాత మళ్లీ సాధకుడు శవంపై కూర్చుని మంత్రం పఠించడం ప్రారంభిస్తాడు.
ఆసాధన చేసే సమయంలో సాధకుడు ఆవాలు లేదా నువ్వులను ఎనిమిది దిక్కువ వైపు జల్లుతారు ఇలా చేయడం వల్ల చుట్టుపక్కల ఉండే దుష్టశక్తులు ఆ సాధకుడిపై దాడి చేయలేవు. శవ సాధన ఫలించిన తరువాత దేవత ఒక కన్య రూపంలో లేదా స్త్రీ రూపంలో దర్శనం ఇస్తుంది సాధన పూర్తి ఆయి దేవతానుగ్రహం పొందిన తరువాత సాధకుడు శవినికి కట్టిన కట్టులను తొలగించి ఆశవానికి స్నానం చేయించి ఆశవాన్ని భూమిలో పాతిపెట్టడం గాని జల ప్రవాహంలో గాని వదిలిపెట్టడం చేస్తారు. సాధనకు ఉపయోగించిన వస్తువులను కూడా జల ప్రవాహంలో వదిలిపెడతారు.
కొన్ని సమయాల్లో సాధకుడికి సహయం చేయడం కోసం స్త్రీని సహయకరాలుగా పెట్టుకుంటారు ఈ స్త్రీని ఉత్తరసాధిక అని పిలుస్తారు ఈమె సాధకుని రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన వృత్తంలో నిల్చుని సాధకుడి ఏకాగ్రతకు భంగం కలిగించే క్షుద్ర శక్తులని ఎదుర్కొంటుంది.
కొంతమంది సాధకులు తమ గురువుని కూడా రక్షణకు ఉపయోగిస్తారు. ఆసమయంలో ఈసాధకుని యొక్క గురువులు భౌతికంగా అక్కడ లేనప్పటికీ ఆగురువుల యొక్క యోగశక్తి సాధకుడిని రక్షిస్తూ ఉంటుంది.
వారణాసి ప్రాంతంలో శవసాధన చేసే అఘోరీలు సాధనలో భాగంగా ఒక ప్రక్రియ నిర్వహిస్తారు. పచ్చిమ బెంగాల్ లో ఈ ప్రక్రియ చేయరు. వారణాసి ప్రాంతంలో సాధకులు శవసాధన చేసే సమయంలో శవం యొక్క చేతి మణికట్టు లేదా కాలి చీలమండ చుట్టూ ఒక సిల్కు దారం కట్టి ఆశవం చుట్టూ ఒక మంత్రవలయం ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఆప్రదేశంలో సంచరించే భూతాలు ప్రేతాలు ఆ రక్షణ వలయాన్ని దాటి రాలేవు. అందువల్ల సాధకులు తమ సాధనను నిర్విఘ్నంగా చేసుకోగలరు.
ఈక్షుద్ర శక్తులు ఏవిధంగానైనా సాధనను పాడుచేయటానికి రక్షణ వలయం దాటి సాధకుడి దగ్గరకు వెళ్ళి సాధనను తప్పించటానికి అనేక ప్రయత్నాలు చేస్తాయి ఆప్రయత్నంలో భాగంగా క్షుద్ర శక్తులు సాదకుడితో మాట్లాడే ప్రయత్నాలు చేస్తాయి ఆసమయంలో సాధకుడు కొన్ని ప్రత్యేక మంత్రాలను చదువుతూ వాటిని అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి రక్షణ వలయం బయట ఉంచబడిన మద్య, మాంసాదులను స్వీకరించి సంతృప్తి పడి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోమని ఆ క్షుద్రశక్తులుతో చెప్తాడు. ఆ సమయంలో శవం యొక్క నోరు కొద్దిగా తెరుచుకుంటుంది అప్పుడు సాధకుడు కొంచెం పాయసాన్ని శవం యొక్క నోటిలో వేస్తాడు దాంతో రక్షణ వలయం బయట ఉన్న క్షుద్రశక్తులు అక్కడి నుండి వెళ్ళిపోతాయి. చివరగా సాధకుడు శవం యొక్క మృతదేహం నరికి దాని నుండి పుర్రెను తీసుకుని లేదా శవం యొక్క వెన్నుముక్కలోని ఒక ఎముకను నరికి తీసుకుంటాడు శవంలో ఉన్న ఆత్మపై పూర్తిగా పట్టు సాధించడం కోసం సాధకుడు ఆవిధంగా చేస్తాడని గ్రహించాలి.
శవంలోని ఆత్మ పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చినప్పుడే అది సాధకుడు చేసే సాధనకు సహకరిస్తుంది. శవసాధన పూర్తి అయిన తరువాత ఆశవాన్ని ప్రవహిస్తున్న నదిలో విసిరివేస్తారు
No comments:
Post a Comment