Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

మహావతార్ బాబాజీ జీవిత చరిత్ర mahavatar babaji full life history

మహావతార్ బాబాజీ జీవిత చరిత్ర 


మహావతార్ బాబాజీ,మహావతార్ బాబాజీ ఫొటోస్, మహావతార్ బాబాజి, మహావతార్ బాబాజి స్టోరి, సత్య మహావతార్, మహావతార్ బాబాజి జీవిత చరిత్ర, mahavatar baba, mahavatar baba story,


ముందు మాట
మహావతార్ బాబాజీ ఇది ఆయనను కలిసిన లాహిరీ మహశయులు మరియు కొంతమంది ఆయనకు పెట్టిన పేర్లు బాబాజీకి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి.
అవి చావులేని గురువు‌, మహరాజ్, మహాముని బాబాజీ, మహ యోగి ,శివబాబా , బాబా గరీభ్ నాథ్ జీ ,బాబాజీ , త్రంబక్ బాబా

బాబాజీ అసలు పేరు నాగరాజు 


బాబాజీ తన జీవితవిశేషాలను చాలా కొద్దిమంది వ్యక్తులకే తెలియజేసాడు.
బాబాజీ తనంతట తానుగా V.Tనీలకంఠన్, యోగి రామయ్యలకు తన జీవితవిశేషాలను తెలియజేసాడు
మరికొన్ని విశేషాలను 
పరమహంస యోగానంద రచించిన "ఒక యోగి ఆత్మకథ"
యుక్తేశ్వర్ గిరి రచించిన "ది హోలీ సైన్స్"
మార్షల్ గోవిందన్ రచించిన "శ్రీ M" గ్రంథాలు మరియు కొంతమంది సిద్దయోగుల అనుభవాల ద్వారా తెలుస్తుంది. 



మహావతార్ బాబాజీ (నాగరాజు) జననం



ఈయన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా కావేరీనది తీరాన గల పరంగిపత్తై  (పోర్చుగీస్ వారు ఈ ప్రాంతాన్ని Port nova  అని పిలిచేవారు) అనే కుగ్రామంలో రోహిణి నక్షత్రంలో కార్తీక పూర్ణిమ నాడు నంబూద్రి బ్రాహ్మణ వంశంలో శివభక్తులైన వేదాంత అయ్యర్, జ్ఞానాంబ దంపతులకు జన్మించాడు. తండ్రి వేదాంత అయ్యర్ స్థానిక సుబ్రహ్మణ్య ఆలయంలో పూజారి. పరంగిపత్తై గ్రామానికి శివుడు ఆనంద నటరాజుగా వెలసిన  చిదంబరం క్షేత్రం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈయన 30 నవంబర్ 203AD లో జన్మించారని కొందరు అంటే
క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో జన్మించాడని మరికొందరి వాదన.


మహావతార్ బాబాజీ (నాగరాజు) బాల్యం


నాగరాజు బాల్యం నుండే దగ్గరలో ఉన్న మణిగురుకులానికి వెళ్ళేవాడు. అక్కడి ప్రధాన అర్చకులు మనోహరంగా మధురమైన సుబ్రహ్మణ్య కీర్తనలు గానం చేయడం నాగరాజు మనసులో గాఢంగా ముద్రవేసుకుంది. నాగరాజు తండ్రితో పాటు చిదంబరంలో జరిగే పుణ్యకార్యక్రమాలలో పాల్గోనేవాడు.

మహావతార్ బాబాజీ(నాగరాజు) సోదరి మాతాజీ


నాగరాజుకి ఒక చెల్లెల్లు కూడా ఉంది ఈవిడని అందరూ మాతాజీ అంటారు ఇప్పటికీ ఈమె కూడా భౌతిక శరీరంతో జీవించి ఉంది ఈమె కూడా మహావతార్ బాబాజీతో సమానంగా సాధనలు చేసిన యోగిని ఈమె గురించి పరమహంస యోగానంద రచించిన "ఒక యోగి ఆత్మకథ" లో కొన్ని అధ్యాయాలు ద్వారా తెలుస్తోంది.

మహావతార్ బాబాజీ (నాగరాజు) జీవితంలో జరిగిన ఐదు ముఖ్య సంఘటనలు


నాగరాజు జీవితంలో జరిగిన ఐదు ముఖ్య సంఘటనలు నాగరాజు మహావతార్ బాబాజీగా అవడానికి కారణం అయ్యాయి

1. పనసపండు వృత్తాంతం
2. నాగరాజు అపహరణ
3. భోగనాథుని శిష్యరికం
4. సుబ్రహ్మణ్య అనుగ్రహం
5. అగస్త్య మహర్షి దర్శనం


పనసపండు వృత్తాంతం


నాగరాజుకి నాలుగు సంవత్సరాలు వయస్సు ఉన్న సమయంలో తల్లి అయిన జ్ఞానాంబ ఒక పనసపండు తీసుకువచ్చింది. రాబోతున్న ఒక ఉత్సవం గురించి ఆపండుని దాచి పనిమీద బయటకు వెళ్ళింది. నాగరాజు చిన్నతనం వల్ల ఆపండుని తినాలని భావించి క్రమపద్ధతిలో వొలిసి ఆపండు మొత్తం తినేసాడు. బయట నుండి వచ్చిన తల్లి విషయం తెలుసుకుని వెర్రి కోపంతో నాగరాజు నోట్లో గుడ్డలు కుక్కి మరొక గుడ్డతో నోరు కట్టేసి చీకటి గదిలో బంధించింది. నాగరాజుకి ఊపిరి తీసుకోవడం కష్టమైంది అప్పుడే ఈశ్వర ప్రేరణతో నాగరాజుకి చాలాసేపు ఊపిరి నిలిపి ఉండగలిగే కుంభక సిద్ది లభించింది. ఇంతలో తల్లి తన బిడ్డ ఊపిరి తీసుకోవడం కష్టమౌతుందని అది ప్రాణానికే ప్రమాదం అని భావించి నాగరాజుకి నోటికి కట్టిన కట్లు తొలగించింది. ఆక్షణంలో నాగరాజుకి తల్లిపై ఎటువంటి కోపం కాని, ద్వేషం కాని కలుగలేదు. సహజంగా కుంభక సిద్ది లబించిన కారణజన్ముడైన నాగరాజు ఈప్రపంచంలో ప్రేమకు మొత్తం కేంద్ర స్థానం తల్లి అని భావించి తనతల్లి చూపెట్టిన unconditional loveని అర్థం చేసుకుని ప్రేమమూర్తిగా మారాడు. బంధాలకు అతీతమైన ప్రేమను గుర్తించి తను చిన్మయత్వం వైపు అడుగులు వేసాడు.

మహావతార్ బాబాజీ(నాగరాజు) అపహరణ (కిడ్నాప్)



నాగరాజు ఐదు సంవత్సరాల వయస్సులో పరంగిపత్తై గ్రామంలో శివాలయంలో జరుగుతున్న ఉత్సవాలు చూడటానికి బయటకు వచ్చాడు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది జనం ఆఉత్సవాన్ని చూడటానికి వచ్చారు. వారితో పాటు బానిస వ్యాపారుల ముఠా (చిన్న పిల్లలను అపహరించి అమ్మేవారు) అక్కడకు వచ్చింది. వారు నాగరాజుని నోట్లో గుడ్డలు కుక్కి అపహరించి ఇంకా ఎన్నో వెదవ పనులు చేస్తూ పడవలో కావేరీనది నుండి సముద్రమార్గం ద్వారా కలకత్తా చేరి నాగరాజుని ఒక ధనిక బ్రాహ్మణుడికి బానిసగా అమ్మేసారు. (తరువాతి కాలంలోఈ బానిస వ్యాపారులు పాకిస్థాన్ లోని బెలుషిస్థాన్ ప్రాంతానికి చెందినవారని బాబాజీ కొంతమందికి చెప్పాడు). ఈ ధనిక బ్రాహ్మణుడు చాలా మంచివాడు, భాగవతుడు వీరి ఇంటికి ప్రతీరోజూ ఎంతోమంది భక్తులు వచ్చేవారు. వారు నిరంతరం దైవస్మరణ, భజనలు, కీర్తనలు చేసేవారు. నాగరాజుకి ఇవన్నీ అలవడ్డాయి నాగరాజు వీళ్ళందరికి  సేవలు చేసేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు సేవలు చేసాడు. యజమాని ఆసేవలకు సంతోషించి నాగరాజుతో నిన్ను విడుదల చేస్తున్నాను నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు అని చెప్పి విడుదల చేసాడు.

మహావతార్ బాబాజీ(నాగరాజు) సత్యాన్వేషణ


విడుదల అయిన తర్వాత నాగరాజు ఒక సన్యాసి బృందంతో కలిసి ఉత్తర భారతదేశ యాత్రలు, దక్షిణ భారతదేశ యాత్రలు చేసాడు. కొంతకాలం వేదాలు ఉపనిషత్తులు పురాణాలలో పరిపూర్ణత కలిగిన కొంతమంది సాధువులతో గడిపాడు. రామాయణ మహభారత ఇతిహాసాలను ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎన్నో చర్చలు నిర్వహించాడు. ఇలా కొంతకాలం తరువాత నాగరాజు తన మనసులో ఇలా అనుకున్నాడు. "మాటలు మార్గనిర్దేశం మాత్రమే చేస్తాయి. ఎలాంటి శాస్త్రీయ భోధనైనా హేతుబద్ద పరిజ్ఞానమైనా అవి పరిమితులలోనివే వాస్తవం ఏమిటో తెలుసుకోవాలంటే వీటికి అతీతమైన మార్గంలో వెళ్ళాలి" అనుకుని తపన పడ్డాడు.

భోగనాథుని దర్శనం 


నాగరాజు పదకొండు సంవత్సరాల వయస్సులో కాశీ నుండి కొంతమంది సాధువులతో కాలినడకన శ్రీలంకలోని సుబ్రహ్మణ్య క్షేత్రమైన కతిర్గమ చేరాడు.
 (కతిర్గమ అంటే కార్తికేయ గ్రామం అని ఆర్థం. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం రూపంలో కాకుండా యంత్ర రూపంలో ఉంటాడు. ఈ యంత్రానికే ఇక్కడ పూజలు, ఉత్సవాలు చేస్తారు. ఇప్పటి ప్రజలకు ఈయంత్రాన్ని కూడా చూపించరు. ఆలయ పూజారులుకి మాత్రమే అనుమతి).

ఇక్కడ భోగనాథుడు అనే సిద్దుడు ఉండేవాడు. ఈయనే ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని స్థాపించాడు. నాగరాజు ఆ సుబ్రహ్మణ్యుడిని దర్శించాడు. తరువాత నాగరాజుకి భోగనాథుని దర్శనం కలిగింది.  నాగరాజు భోగనాథునికి శిష్యుడైనాడు. నాగరాజుకి భోగనాథుడు సుబ్రహ్మణ్య మంత్రం , కొన్ని ప్రత్యేకమైన ధ్యాన సాధనలు ఉపదేశించాడు. నాగరాజు ఒక వటవృక్షం క్రింద ఆరు నెలలు తీవ్రమైన  మంత్ర సాధనలు, ధ్యాన సాధనలు చేసాడు.ఆయన సాధనలు పరిపక్వత అయ్యే కొలది తను చదువుకున్న అనేక గ్రంథాలలోని సత్యాలు వాస్తవ సత్యాలుగా కనిపించటం, అనుభుతి చెందటం జరిగేది. బాబాజీ తన భౌతిక శరీర పరిధి నుండి ఈ విశ్వమే తన పరిధిలేని ఒక శరీరమని గ్రహించాడు.  నాగరాజుకి సుబ్రహ్మణ్య దర్శనం అయింది. నాగరాజుకి సుబ్రహ్మణ్యుడు మృత్యుంజయత్వం వరంగా ప్రసాదించాడు. అప్పటి నుండి నాగరాజుకి ఎప్పటికీ యువకుడిగా ఉండే సిద్ది లభించింది. తరువాత గురువుగారి దగ్గరికి వెళ్ళాలనిపించి భోగనాథున్ని స్మరించాడు. భోగనాథుని దర్శనం అయింది. వారిద్దరి మధ్య సంభాషణలు ఇలా ఉన్నాయి.

నాగరాజు : గురువుగారు ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు

భోగనాథుడు : నాయనా నీకు సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగింది కానీ నీకు ఇది చాలదు. నీవు సిద్ధస్థితిని సాదించాలి నీవు జన్మాంతర సంస్కారం కలిగినటువంటి వ్యక్తివి. నిన్ను పూర్వజన్మల నుండి కూడా నేనెరుగుదును. కొన్ని కారణాల వల్ల నీకు మానవజన్మ వచ్చింది. నీవు కుర్తాళం వెళ్ళు అక్కడ అగస్త్య మహర్షి గురించి ధ్యానం చెయ్యి. ఆయన దర్శనం అయ్యే వరకూ తపస్సు చెయ్యి. ఆయన నీకు సిద్దత్వం ఇచ్చేటట్లు నేను చూస్తాను.

మహావతార్ బాబాజీ(నాగరాజు)కి అగస్త్య మహర్షి దర్శనం సిద్దత్వం లభించడం


నాగరాజు గురువాక్యం ప్రకారం కుర్తాళం చేరాడు. జగన్మాత 64 క్షేత్రాలలో ఇది ఒకటి. నాగరాజు ఆహరం తీసుకోకుండా నీరు మాత్రం త్రాగుతూ 48 రోజులు కఠోర దీక్ష చేసాడు 48వ రోజున బాబాజీ శరీరం పూర్తిగా పట్టు కోల్పోయింది. ఇంతలో దివ్యకాంతితో అగస్త్య మహర్షి దర్శనం కలిగింది. అగస్త్య మహర్షి అనుగ్రహించి నాగరాజుకి క్రియాయోగ రచనల్లో ఉన్న "వశీ యోగం" అనే అద్భుతమైన ప్రాణాయామ ప్రక్రియను ఉపదేశించాడు. నాగరాజు ఆప్రక్రియ ద్వారా ముఖ్యమైన యోగ సిద్దత్వాన్ని పోందాడు. ఆయనలోని అంతర్గత శక్తి జాగృతి అవుతూ వచ్చింది.  "నాయనా ఈరోజు నుండి సిద్దుడివి అవుతావు నీవు హిమాలయ శ్రేణుల్లో ఉన్న బద్రీనాథ్ క్షేతానికి వెళ్ళి అక్కడ మహోన్నత సిద్ది పొందమని తెలియజేసాడు. ఈక్షేత్రం హిమాలయపర్వత శ్రేణుల్లో టిబెట్ కు దక్షిణ భాగంలో కొద్దిమైళ్ళ దూరంలో 1243 అడుగుల ఎత్తులో నెలకొని ఉంది. నాగరాజు బద్రీనాథ్ క్షేత్రం దర్శించి అక్కడ18 నెలలు క్రియాయోగ సాధన చేసాడు. ఈసాధన ద్వారా నాగరాజు(బాబాజీ) సౌరభ సమాధి అనే గొప్ప స్థితిని పోందాడు. భగవంతుని అనుగ్రహం లభించింది. నాగరాజు భౌతిక శరీరం బంగారు రంగు కాంతితో నిండి దివ్యశరీరంగా భాషించింది.

అప్పటి నుండి మహావతార్ బాబాజీ భౌతిక శరీరంతో ఇప్పటికీ ఉన్నారు. 700 శతాబ్దంలో మహావతార్ బాబాజీ ఆదిశంకరాచార్యులకు క్రియాయోగ సాధనలో దీక్ష ఇచ్చాడు కొన్ని ధ్యాన పద్ధతులు ఉపదేశించాడు. గోవింద పాదాచార్యులు శిక్షణ ఇచ్చిన గురువని మహావతార్ బాబాజీ దీక్షా గురువని పరమహంస యోగానంద అన్నారు.

మహావతార్ బాబాజీ 1868 లో శ్యామాచరణ్ లాహిరీకి ఈ క్రియాయోగ దీక్షను అందించాడు. ఈ శ్యామాచరణ్ లాహిరీ వల్లే మహావతార్ బాబాజీ గురించి వెలుగులోకి వచ్చింది. శ్యామాచరణ్ లాహిరీ చాలా మంది శిష్యులకు దీక్షను ఇచ్చారు. వారి ప్రియశిష్యుడు "శీ యుక్తేశ్వర్ గిరి బాబా" ఈ యుక్తేశ్వర్ గిరి బాబా మహావతార్ బాబాజీని మూడుసార్లు కలుసుకున్నాడు. ఈయన మహావతార్ బాబాజీ అనుగ్రహముతో " THE HOLY SCIENCE " అనే గ్రంథాన్ని రాసాడు.

ఈ యుక్తేశ్వర్ గిరి బాబా ప్రియ శిష్యుడే "పరమ హంస యోగానంద" ఈయన "THE AUTOBIOGRAPHY OF YOGI" అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం కొన్ని మిలియన్లు అమ్ముడుపోయాయి. ఈ పుస్తకం అనేక భాషలలోకి అనువదించబడింది.

మహావతార్ బాబాజీ 1940లో v.t నీలకంఠన్ గారికి 1942లో s.a.a రామయ్య గారికి దర్శనం ఇచ్చి  క్రియాయోగ కుండలినీ దీక్ష ఇచ్చాడు.

మహావతార్ బాబాజీ ఆశ్రమాలు రాణీ ఖేడ్ మరియు కైలాస పర్వతం శిఖరం పైన ఉన్నాయి ఇక్కడికి రావడం అందరికీ సాధ్యంకాదు.

ఇప్పటికీ మహావతార్ బాబాజీకి చాలా మంది శిష్యులు ఉన్నారు.  చాలా మందికి దర్శనాలు ఇస్తున్నారు.

No comments:

Post a Comment