రామకోటి నియమాలు రామకోటికి సంభందించిన ధర్మసందేహలు
1.రామకోటి వ్రాయడం ఏరోజు నంచి మొదలుపెట్టాలి ?
రామకోటి వ్రాయడానికి శుభ సమయాలు
1.వసంత నవరాత్రులు
2. ఏకాదశి తిథి
3. బుధవారం
4. పునర్వషు నక్షత్రం
ఇవి శుభ సమయాలు
రామకోటి వ్రాసేవారు పాటించాల్సిన నియమాలు
1. రామకోటి వ్రాయడం ప్రారంభించే ముందు రామునికి పుజచేసి ప్రారంభించాలి
2.రామకోటి రాసేవారు స్నానం చేసి నియమ నిష్ఠలతో ఎవరిని తాకకుండా ఒక శుభ్రమైన ప్రదేశంలో గానీ పూజ గదిలో గాని కూర్చుని రాయాలి
3. ప్రతిరోజూ కనీసం 108కి తక్కువ కాకుండా రాయాలి
4. రామకోటి రాసేవారు ఎదురుగా సీతారాముల చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుని నోటితో ఉచ్ఛరిస్తూ రాయాలి దీనివల్ల మానసిక,కాయిక,వాచిక జపం చేసినట్లు అవుతుంది
(a. మనసులో తలుచుకోవడం వల్ల మానసిక జపం
b. చేతితో రాయడం వల్ల కాయిక జపం
c. నోటితో ఉచ్చరించడం వల్ల వాచిక జపం)
* ఈ పద్దతిని నడిచే దేవుడని పేరుపొందిన చంద్రశేఖర పరమాచార్య ప్రతిపాదించారు
5. రామకోటి రాసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు
6. రామకోటి రాయడం లక్ష పూర్తి అయిన తరువాత రామునికి పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచాలి. ఈవిధంగా ప్రతీ లక్షకు చేయాలి.
7.రామకోటి రాసే పెన్ను ప్రత్యేకంగా ఉండాలి దానిని వేరే పనులకు ఉపయోగించకూడడు.
8. రామకోటి గ్రంథాన్ని రాయడం పూర్తి అయిన తరువాత ఎవరూ తాకకుండా ఒక పవిత్ర ప్రదేశంలో ఉంచండి. అశుచి సమయాలలో రామకోటి గ్రంథాన్ని తాకకండి
9.వీలైనంత వరకూ ప్రతీరోజూ తలస్నానం చేయాలి.
రామకోటి ధర్మ సందేహలు
ప్ర). రామకోటి రాయడానికి ఇన్ని నియమాలు ఆవసరమా?.జ). దైవ సంబంధమైన విషయాలలో నియమ,నిష్ఠలు, శ్రద్ధ, భక్తి ఎంత ఎక్కువ ఉంటే వాటి ఫలితాలు కూడా అంత ఎక్కువగా ఉంటాయి. రామకోటికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయి.
ప్ర). సూతకం (మైల) సమయంలో రామకోటి రాయవచ్చా?.
జ.) సూతక సమయంలో రామకోటి రాయడానికి సాంప్రదాయం ఒప్పుకోదు. రామకోటి ఎప్పుడు రాయాలి? ఎలా రాయాలి? రామకోటి నియమాలు ఏమిటి అనేది ధర్మ సింధు గ్రంథంలో చాలా స్పష్టంగా వివరించబడింది. రామకోటిని నియమ నిష్ఠలతో రాయాలి. రామకోటి గ్రంథం సాక్షాత్తు రామ స్వరూపం*కాని వాచిక జపం,మానసిక జపం చేయవచ్చు
ప్ర). రామకోటి రాయడం మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే ఏదైనా ప్రమాదమా ?.
జ). ఎటువంటి ప్రమాదమూ లేదు. భగవంతున్ని ప్రేమతో ఆరాదించాలి తప్ప భయంతో కాదు. భగవత్కార్యం కొంచెం చేసినా అది మంచిదే తప్ప ప్రమాదం కాదు. రామకోటి రాయడం ఆపడం అనేది మీశారీరిక (అనారోగ్యం, సమయం కుదరక పోవడం) మానసిక స్థితిని (ఆసక్తి లేకపోవడం, వేరే కారణాలు) బట్టి మీరే నిర్ణయించుకోవచ్చు. రామకోటి రాయడం మధ్యలో ఆపేసినంత మాత్రాన ఎటువంటి ప్రమాదం జరుగదు.
ప్ర). రామకోటి పూర్తి అయింది. ఉద్యాపన ఎలా చేయాలి?. వీటిని ఎవరికి, ఏవిధంగా సమర్పించాలి?.
జ). మొదటి విధానం.
రామకోటి గ్రంధాలని ఒక పసుపు వస్త్రంలో మూటగట్టి రామునికి పూజ చేసి ఆ గ్రంథాలను శిరస్సున పెట్టుకుని రాముడిని స్మరిస్తూ కాలినడకన గాని రవాణా మార్గాల ద్వారా గాని భద్రాచలం రాముల వారి దేవస్థానానికి అప్పగించాలి.
రెండవ విధానం
ధనం, సంపద ఉంటే రామాలయం నిర్మించి అక్కడ చతురస్రాకారంగా ఒక స్తంభం నిర్మించి అందులో రామకోటి గ్రంథాలను నిక్షిప్తం చేసి యజ్ఞం చేయించాలి.
మూడవ విధానం
రామకోటి గ్రంథాలను పసుపు వస్త్రంలో మూటకట్టి పూజించి ఏదైనా ప్రవహిస్తున్న జీవనది (గోదావరి,కృష్ణ, వంటి ఎప్పుడూ నీటి ప్రవాహంతో ఉండే నదులు) మధ్యలో విడవాలి.
All copyrights reserved 2012 digital media act
No comments:
Post a Comment