వివాహాలు శాష్త్ర ప్రకారం ఎన్ని రకాలు
వివాహాలు తొమ్మిది రకాలు
1. బ్రాహ్మ వివాహం
ఉత్తమ వంశానికి చెందిన, మంచి శీల స్వభావాలున్న వరుడిని మామయే స్వయంగా తన ఇంటికి పిలిచి అలంకరించి పూజించి కన్యాదానం చేయడం బ్రాహ్మ వివాహం
2. దైవ వివాహం
యజ్ఞం చేస్తూ ఋత్విజున్ని అలంకరించి పూజించి కన్యను ఇవ్వడం దైవ వివాహం
3. ఆర్ష వివాహం
వరుని నుండి ధర్మార్థంగా ఒకటి, రెండు జతల ఆవులను, ఎద్దులను స్వీకరించి శాస్త్రోక్తంగా పిల్లనిచ్చి పెళ్ళి చేయడం ఆర్ష వివాహం
4. ప్రాజాపత్య వివాహం
వదూవరులను ఒకచోట చేర్చి "మీరిద్దరూ గృసస్థ ధర్మాన్ని నిర్వర్తించండి" అని చెప్పి పూజ చేసి కన్యను దానం చేయడం ప్రాజాపత్యం
5. అసుర వివాహం
కన్యకు, కన్య తండ్రికి, కన్య భందువులకు యధాశక్తి ధనాదులు ఇచ్చి స్వచ్ఛందంగా వరుడే కన్యను గ్రహించడం అసుర వివాహం.
6. గాందర్వ వివాహం
కన్య, బ్రహ్మచారి పరస్పరం ఇచ్ఛాపూర్వకంగా తమకు తామే చేసుకునేది గాందర్వ వివాహం
7. రాక్షస వివాహం
కన్యను అపహరించి తీసుకుని పోయి వరుడు తన గృహంలో శాష్త్రోక్తంగా చేసుకునే వివాహం రాక్షస వివాహం
8. పైశాచిక వివాహం
అన్నిటికంటే అథమమైనది నిదురిస్తున్న, కామం పట్టిన లేదా మతిలేని కన్యను ఎవరూ చూడకుండా పట్టుకుని పొయి చేసుకునే వివాహం పైశాచిక వివాహం.
మొదటి నాలుగు రకాల వివాహాలు బ్రాహ్మణ వర్ణంలోనూ తరువాతి రెండు రకాల వివాహలు క్షత్రియ వర్ణంలోనూ అవలంభిస్తారు
సవర్ణ వివాహాలలో గృహసూత్రానుసారం కన్య వరుని పాణిగ్రహణం చేయాలి.
కృత, త్రేతా, ద్వాపర యుగాలలో క్షత్రియ కన్య బ్రాహ్మణ వరుడిని గానీ, వైశ్య వరుడు శూద్రకన్యను గాని ఇదివరకు చెప్పినట్లు వివాహం చేసుకోవడం ఆచారంగా కొన్నిచోట్ల ప్రత్యేక సందర్భాలలో జరిగేది. కలియుగంలో ఈపద్దతి ఎక్కడా ఎటువంటి సందర్భాలలోనూ లేదు.
వర్ణ సంకరం జరుగరాదు.
No comments:
Post a Comment