Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

షష్ఠీ దేవి స్తోత్రం తెలుగు వివరణSashti Devi stotram in Telugu lyrics and meaning

 షష్ఠీ దేవి స్తోత్రం తెలుగు వివరణ


షష్ఠీ దేవి స్తోత్రం తెలుగు వివరణSashti Devi stotram in Telugu lyrics and meaning, షష్ఠి దేవి స్తోత్రం, షష్ఠి దేవి స్తోత్రం తెలుగులో, షష్ఠి దేవి స్తోత్రం తెలుగు pdf, sashti devi stotram, sashti devi stotram with telugu lyrics and meaning, షష్ఠి దేవి స్తోత్రం pdf, sashti devi stotram in telugu, sashti devi stotram, sashti kavacham in Telugu pdf, sashti kavacham in telugu




రక్షరక్ష జగన్మాతః దేవి మంగళ చండికే |

హారికే విపదాంరాశేర్హర్ష మంగళకారికే |1|


హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళదాయికే |

శుభే మంగళ దక్షే చ శుభే మంగళచండికే |2|


మంగళే మంగళార్హేచ సర్వమంగళ మంగళే |

సతాం మంగళదే దేవి! సర్వేషాం మంగళాలయే |3|


పూజ్యే మంగళవారేచ మంగళా భీష్టదేవతే |

పూజ్యే మంగళ భూపస్య మనువంశస్యసంతతమ్ |4|


మంగళాధిష్ఠాతృ దేవి మంగళానాంచ మంగళే |

సంసారమంగళాధారే ! మోక్ష మంగళదాయిని |5|


సారేచ మంగళాధారే! పారే సర్వస్యకర్మణామ్ |

ప్రతి మంగళ వారేచ పూజ్యే సర్వసుఖప్రదే |6|



స్తోత్రభావము 


1. ఓ జగన్మాతా! మంగళదాయినీ! ఆనందకారిణీ! ఆపదలు బాపు తల్లీ! దేవి! మంగళచండికా! నన్ను రక్షించుము. 


2. ఆనంద మంగళదాయినీ! ఆనంద మంగళ ప్రవీణా! శుభమంగళ పరాయణా! శుభా! మంగళ చండికా! 


3. తల్లీ! మంగళా దేవీ! మంగళయోగ్యా! సర్వమంగళ మంగళా! సాధుజనులకు శుభము లొసగు

జననీ! 


4. శుభమంగళనిలయా! మంగళవారపూజ్యా! మంగళాభీష్టదా! మను వంశమున

జన్మించిన మంగళరాజుచే పూజలందుకొనిన తల్లీ! 


5. ఓ హోమాధిష్టాన దేవీ! మంగళ

మంగళా! సంసార మంగళాధారిణీ! ముక్తి మంగళ దాయినీ! మంగళకారిణీ!


6. మంగళాధారా! సర్వకర్మలకు పరాకాష్ఠయైనదానా! ప్రతి మంగళవారమున పూజింప

బడుదానా! మంగళ సుఖప్రదా! నీకు నమస్కారము. నన్ను బ్రోవుము. 



ఈ స్తోత్రముతో శివుడు మంగళచండికను స్తుతించెను. ప్రతిమంగళ వారమునను మంగళచండికను శివుడు పూజించెను. అటు పిమ్మట మంగళుడను రాజు

భద్రప్రద యగు మంగళదేవిని పూజించెను.


పిమ్మట మంగళుడు అనగా కుజుడు మంగళ చండికను పూజించెను. పిమ్మట ప్రతి విశ్వము నందు శివునిచే

పూజింపబడిన మంగళను దేవి ముని, మను, నరులు పూజించినారు. 


ఈ మంగళాదేవి స్తోత్రమును నిశ్చల మనస్సుతో వినువాడు శుభములను పొందగలడు.

అతనికి అమంగళ మెన్నడును కలుగదు.





No comments:

Post a Comment