Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం విత్ మీనింగ్ sarva deva krutha lakshmi stotram with meaning

 సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం (బ్రహ్మ వైవర్త పురాణం)

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం తాత్పర్యముతో sarva devakrutha Lakshmi stotram with Telugu lyrics and meaning




క్షమస్త్వ భగవత్యంభ క్షమాశీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరివర్జితే. (1)

ఉపమే సర్వసాధ్వీనాం దేవానాం దేవపూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యం చ నిష్ఫలమ్  (2)

సర్వసమ్పత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ 
రాసేశ్వర్యాధిదేవీ త్వం త్వత్క్కలాః సర్వయోషితః  (3)

కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సిన్దుకన్యకా
స్వర్గేచ స్వర్గలక్ష్మీ స్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే  (4)

వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ 
గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః  (5)

కృష్ణణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయమ్ 
రాసే రాసేశ్వరీ త్వం చ బృన్దా బృన్దవనే వనే  (6)

కృష్ణప్రియా త్వం భాణ్డీరే చన్ద్రా చన్దనకాననే 
విరజా చమ్పకవనే శతశృంగే చ సున్దరీ  (7)

పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీ వనే , 
కున్దదన్తీ  కున్దవనే సుశీలా కేతకీవనే  (8)

కదమ్బమాలా త్వం దేవీ కదమ్బకాననేఽపిచ , 
రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మిర్గృహే గృహే  (9)

ఇత్యుక్త్వా దేవతా ! సర్వే మునయో మనవ స్తథా 
రురు దుుర్నమ్రవదనాః శుష్కకణ్ఠోష్ఠ తాలుకాః  (10)

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్ 
యః పఠేత ప్రాతరుత్థాయ సవై సర్వం లభేద్ధృవమ్  (11)

అభార్యో లభతే భార్యాం వినీతాం చ సుతాం సతీమ్ 
సుశీలాం సున్దరీం రమ్యాం మతిసుప్రియవాదినీమ్  (12)

పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్ 
ఆపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్   (13)

పరమైశ్వర్య యుక్తం చ విద్యావన్తం యశస్వినమ్ 
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీ ర్లభతే శ్రీయమ్  (14)

హత బన్దుర్లభేద్ బన్దుం ధన భ్రష్టో ధనం లభేత్ , 
కీర్తి హీనో లభేత్ కీర్తిం ప్రతిష్టాం చ లభేత్ ధ్రువమ్  (15)

సర్వమంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్
  హర్షానన్దకరం శశ్వద్ధర్మ మోక్ష సుహృత్ ప్రదమ్  (16)

భావం

1.  భగవతీ! అంబా ! క్షమాశీలా ! పరాత్పరీ మమ్ములను క్షమింపుము . శుద్ధ 
సత్వస్వరూపిణీ ! కోపాదులను పరిత్యజింపుము .


2. సర్వసాధ్వులందు శ్రేష్ఠురాలా సర్వ దేవతా పూజితురాలా నీవు లేనిదే సర్వ జగములు మృత్యు తుల్యములై నిష్ఫలములు కాగలవు

3. దేవీ ! నీవు సంపత్స్వరూపిణివి , సర్వులయందు సర్వ రూపిణివి . రాసేశ్వర్యాధి దేవీ ! నీకళలనుండే సర్వులుద్భవించిరి
 
4. కైలాసంలో పార్వతివి నీవే , క్షీరసాగరమును సింధు కన్యకవు నీవే స్వర్గమునందు స్వర్గ లక్ష్మివి నీవే , భూలోక మందు మర్త్యలక్ష్మిిివి నీవే 

5. వైకుంఠమందు మహాలక్ష్మివి నీవే దేవ దేవివైైన సరస్వతివినీ వే , గంగవు , తులసిని , బ్రహ్మలోకమందు సావిత్రివి నీవే

6.  గోలోకమందు నీవే స్వయముగ కృష్ణ ప్రాణాధి దేవి వైన రాధవు , 
రాసమండలమందు రాసేశ్వరివి బృందావనమందు బృందవునీవు .

 7. భాంఢీర వనమందు కృష్ణ ప్రియవు నీవే , చందన కాననమందు చంద్రవు నీవే , చంపక వనమందు విరజా దేవివి నీవే . శతశృంగమందు సుందరివి నీవే 

8. పద్నవనమందు పద్మావతివి , మాలతీ వనమందు మాలతివి కుంద వనమందు కుందదంతివి కేతకీ వనమందు సుశీలవు నీవే . 

9. కదంబ కాననమందు నీవే కదంబమాలవు , రాజు గృహమందు రాజలక్మివి  గృహములందు గృహలక్ష్మివి నీవే . 

10. ఇట్లు సర్వ దేవతలు , మహర్షులు , మనువులు స్తుతించి రోదించుచు నమ్ర వదనులై శుష్క కంఠోష్ఠ తాలుకా యుక్తులై అమ్మయెదుట నిలువబడిరి 

11. పుణ్యమయమైన , శుభప్రదమైన సర్వదేవతలు స్తుతించిన యీ లక్ష్మీస్తోత్రమును ప్రాతః కాలమున పఠించువారికి సర్వమనొ వాంఛితలు తప్పక లభింపగలవు . 

12. భార్య లేని వారికి వినీతురాలైన, సతియైన, సుశీలయైన, సుందరియైన,  సుప్రియవాదినియైన,

13. శుద్ధురాలైన , ఉత్తమకుల సంజాతయైన పుత్రపౌత్రనతియైన భార్య లభింపగలదు . పుత్రులు లేని వారికి వైష్ణవుడైన , చిరంజీవియైన
 
14. పరమైశ్వర్య యుక్తుడైన యశస్వియైన , విద్యావంతుడైన పుత్రుడు లభింపగలదు

15. బంధువియోగము సంభవించిన వారికి బంధువులు , ధన భ్రష్టులకు ధనము లభింపగలదు . కీర్తిహీనులకు కీర్తి ప్రతిష్ఠలు నిశ్చయముగ లభింపగలవు . 

16. సర్వ మంగళప్రద మైన యీస్తోత్రము  శోకసంతాపనాశకము, హర్షానందకరము, ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదింపగలది


ఇతి బ్రహ్మ వైవర్త పురాణ అంతర్గత సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం



All copyrights reserved 2012 digital media act

No comments:

Post a Comment