మధురాష్టకం విత్ మీనింగ్
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ (1)
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ (2)
వేణుర్మధురో రేణుర్మధురః
పాణిర్మధురః పాదౌమధురౌ
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ (3)
గీతం మధురం పీతం మధురం
ముక్తం మధురం సుప్తం మధురమ్
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ (4)
కరణం మధురం చరణం మధురం
హరణం మధురం స్మరణం మధురమ్
వమితం మధురం శమితం మధురమ్
మధురాధిపతేరఖిలం మధురమ్ (5)
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ (6)
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం భుక్తం మధురమ్
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం. (7)
గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ (8)
ఇతి శ్రీవల్లభాచార్యకృతం మధురాష్టకం సంపూర్ణం
శ్రీకృష్ణా! నీ పెదవులు మధురం. ముఖము మధురం. కన్నులు మధురం. నవ్వులు మధురం. హృదయం మధురం. నడకతీరు మధురం. మధురాధిపతి నీసర్వం మధురం (1)
శ్రీకృష్ణా! నీ పలుకులు మధురం. ప్రవర్తన మధురం. వస్త్రాలు మధురం. నీభంగిమ ణధురం. కదలిక మధురం. తిరుగుట మధురం. మధురాధిపతి నీసర్వం మధురం (2)
శ్రీకృష్ణా! నీవేణుగానం మధురం. పాద ధూళి మధురం. చేతులు మధురం. పాదములు మధురం, నాట్యము మధురం. స్నేహము మధురం. మధురాధిపతి నీసర్వం మధురం (3)
శ్రీకృష్ణా! నీ పాటలు మధురం. త్రాగుట మధురం. ముక్తం మధురం. నిద్రించుట మధురం. ఆకారం మధురం. తిలకం మధురం. మధురాధిపతి నీసర్వం మధురం (4)
శ్రీకృష్ణా! నీకార్యములు మధురం. చరణాలు మధురం. పాపహరణం మధురం. స్మరణం మధురం. బాహ్యచేష్ఠలు మధురం. మధురాధిపతి నీసర్వం మధురం (5)
శ్రీకృష్ణా! నీశబ్ద రవం మధురం.పూలహారం మధురం. యమునా నది మధురం. మాటల తీరు మధురం. పారే నీరు మధురం. తామర అందం మధురం. మధురాధిపతి నీసర్వం మధురం (6)
శ్రీకృష్ణా! నీ గోపికల మది మధురం. చిలిపి మధురం. యోగాభ్యాసం మధురం.ఆ అనుభవం మధురం. సంస్కారాలు మధురం. సదాచారాలు మధురం. మధురాధిపతి నీసర్వం మధురం (7)
శ్రీకృష్ణా నీ గోపబాలురు, గోవులు మధురం. నీసృష్టి మధురం. సృష్టిపై నీ ఆధిపత్యం మధురం. మధురాధిపతి నీసర్వం మధురం (8)
No comments:
Post a Comment