అచ్యుతాష్టకం విత్ మీనింగ్
అచ్యుత స్తోత్రం
అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్
శ్రీధరం మాదవం గోపికావల్లభం
జానకీ నాయకం రామచంద్రంభజే (1)
అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితమ్
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే (2)
విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే
వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః (3)
కృష్ణ! గోవింద! హేరామ! నారాయణ!
శ్రీపతే! వాసుదేవాజిత శ్రీనిధే!!
అచ్యుతానంత! హేమాధవాధోక్షజ!
ద్వారకానాయక! ద్రౌపదీ రక్షక (4)
రాక్షస క్షోభిత స్సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతా కారణః
లక్ష్మణే నాన్వితో వానరై సేవితో
గస్త్య సంపూజితో రాఘవః పాతుమామ్ (5)
ధేనుకారిష్ట హ నిష్టకృత్ ద్వేషిణాం
కేశిహా కంస హృద్వంశికా వాదకః
పూతనా కోపక స్సూరజా ఖేలనో
బాలగోపాలకః పాతుమాం సర్వదా (6)
విద్యుదుద్యోతవత్ ప్రస్ఫుర ద్వాససం
ప్రావృడం భోదవత్ ప్రోల్లసద్విగ్రహం
వన్యయామాలయా శోభితోరస్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే (7)
కుంచితైః కుంతలైః భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్ కుండలం గండయోః
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే (8)
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుష స్సస్పృహం
వృత్తత స్సుందరం వేద్య విశ్వంభరం
తస్య వస్యో హరిర్ జాయతే సత్వరమ్ (9)
భావం
1. నాశనము లేనివాడు, కేశవుడు, రాముడు, నారాయణుడు, దామోదరుడు, వాసుదేవుడు, హరియు, శ్రీధరుడు, మాధవుడు, గోపికావల్లభుడు జానకీనాయకుడైన రామచంద్రుని భజింతును.
2. శాశ్వతుడు, అందమైన ముంగురులు కలవాడు, సత్యభామాపతి, మాధవుడు, శ్రీధరుడు, రాధికకు ఆరాధ్యుడు, లక్ష్మీదేవికి నివాసమైనవాడు, వర్ణింపశక్యం కాని మనస్సుందరుడు, దేవకీదేవికి ఆనందము కలుగజేయు ఆశ్రీకృష్ణుని నేను ధ్యానింతును.
3. సర్వము వ్యాపించినవాడు, జయశీలుడు, శంఖము, చక్రము కలవాడు,రుక్మిణిని రామావతారమున సీతాదేవిని అలరించినవాడు, గోపికావల్లభుడై వారిచే పూజలందుకొన్నవాడు, కంసుని సంహరించినవాడు, మురళీనాదము చేయుచూ ఆత్మానందస్వరూపుడై విరాజిల్లుతున్న ఓ స్వామి నీకు నా వందనములు.
4.హే కృష్ణా! గో, భూ రక్షణ చేసి గోవిందుడివైతివి, రాముడివైతివి, నారాయణుడివైతివి, లక్ష్మీపతివి, అన్నిటా వశింసువాడవు. అపజయము లేనివాడవు, నాశనము లేనివాడవు, ఆద్యంతములు లేనివాడవు, మాధవుడవు, ఊర్థ్వరూపుడవు, ద్వారకానాయకుడవు, ద్రౌపదిని రక్షించినవాడవు.
5. రాక్షసులను సంహరించినవాడు, సీతతో శోభించిన వాడు, దండకారణ్యం భూమిని పవిత్రం చేసినవాడు లక్ష్మణుడితో కలిసిన వాడు వానరులచే సేవింప బడినవాడు, ఆగస్ట్య మహర్షి పూజించబడిన వాడు అగు రాముడు నన్ను రక్షించు గాక
6. ధేనుకాసురుని సంహరించిన వాడు, ద్వేషించువారిని నాశనం చేయువాడు, కేశి అనే రాక్షసుని-కంసుని చంపినవాడు వేణుగానం చేయువాడు, పూతను అంతమొందించినవాడు కాళీయుని మర్దించి యీ నా ఆనందింపచేసిన వాడు ఆ బాలగోపాలుడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక.
7. మెరుపువలె మెరయుచున్న వస్త్రములు ధరించిన వాడు, వర్షాకాలపు మేఘం వలె అందమైన శరీరం కలవాడు, తులసిమాలతో అలంకరింపబడిన వక్షస్థలం కలవాడు, ఎర్రని పాదములు కలవాడు, పద్మ నేత్రుడు అగు దేవుణ్ణి సేవించుచున్నాను
8. వంకరలు తిరిగిన జుట్టుతో అందమైన ముఖము కలవాడు, సుందరమైన శిరస్సు కలవాడు, చెంపలపై ప్రకాశించు కుండలములు కలవాడు, హారములు - కేయూరములు - కంకణములు - గజ్జెలు ధరించినవాడు, నల్లనివాడు అగు దేవుణ్ణి సేవించుచున్నాను
9. ఇష్టములను తీర్చునది, మంచి వృత్తము నందు (స్రగ్విణీ) రచించబడినది, పరమాత్ముని తెలియజేయునది అగు ఈ అచ్యుతాష్టకమును ఎవరైతే భక్తితో ప్రతిదినము పఠించునో వారికి వెంటనే హరి ప్రసన్నుడగును.
No comments:
Post a Comment