యమాష్టకం yama ashtakam
తపసా ధర్మ మారాధ్య పుష్కరే భాస్కర: పురా |
ధర్మం సూర్యః సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్ |1|
సమతా సర్వభూతేషు యస్యసర్వస్యసాక్షిణః |
అతోయన్నామ శమన ఇతితం ప్రణమామ్యహమ్ |2|
యేనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాంజీవినాం పరమ్ |
కామాను రూపం కాలేన తం కృతాన్తం నమామ్యహమ్ |3|
బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ది హేతవే |
నమామి తం దండధరం యశ్శాస్త్రా సర్వజీవినామ్ |4|
విశ్వంచ కలయత్యేవ యస్సర్వేషు చ సంతతమ్ |
అతీవదుర్నివార్యంచ తంకాలం ప్రణమామ్యహమ్ |5|
తపస్వీ బ్రహ్మనిష్ఠయ: సంయమీ సంజితేంద్రియః |
జీవానాం కర్మఫలదస్తంయమం ప్రణమామ్యహమ్ |6|
స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్య కృతాంభవేత్ |
పాపినాం క్లేశదోయస్తం పుణ్యమిత్రం నమామ్యహమ్ |7|
యజ్జన్మ బ్రహ్మణాంశేన జ్వలంతం బ్రహ్మతేజసా |
యోధ్యాయతి పరంబ్రహ్మ తమీశం ప్రణమామ్యహమ్ |8|
ఇత్యుక్త్వాసాచ సావిత్రీ ప్రణనామయమం మునే |
ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యఃపఠేత్ |9|
యమాత్తస్యభయం నాస్తి సర్వపాపాత్రముచ్యతే |
మహాపాపీ యది పఠేత్ నిత్యం భక్తి సమన్వితః |
యమః కరోతి తం శుద్ధం కాయవ్యూహేన నిశ్చితమ్ |10|
స్తోత్రభావము:-
1. పూర్వము సూర్యుడు పుష్కర తీర్ధమున యమధర్మరాజుని నారాధించెను. సూర్యుడు ధర్మరాజును పుత్రునిగా పొందెను. అట్టి ధర్మరాజునకు నమస్కారము.
2. అన్ని ప్రాణులందు సమభావమున సాక్షిగా నుండువాడు శమనుడని పిలువబడు “సమవర్తి"కి నమస్కరించుచున్నాను.
3. ఎవడు సమస్త ప్రాణులనంత మొందించువాడో అట్టికాలునకు నమస్కారము.
4. ఎవడు పాపాత్ములను పరిశుద్దులను చేయుటకై దండించుచున్నాడో అట్టి దండడరునకు నమస్కారము.
5. ఎవడు దుర్నివారుడగు కాలస్వరూపుడో అట్టికాలునకు నమస్కారము,
6. ఎవడు జీవుల కర్మఫలప్రదుడై వెలుగొందునో అట్టి వైవస్వతునకు నమస్కరించుచున్నాను.
7. స్వాత్మారాముడు సర్వజ్ఞుడు పుణ్యాత్ములకు మిత్రుడు పాపులను కష్ట పెట్టువాడునగు పితృపతికి నమస్కరించుచున్నాను.
8. ఎవడు బ్రహ్మాంశచే జన్మించెనో బ్రహ్మతేజముతో విరాజిల్లునో ఎవడు పరబ్రహ్మమును ధ్యానించుచుండునో
అట్టి యీశునకు నమస్కరించుచున్నాను.
9. ఈ యమాష్టకమును నిత్యము ప్రొద్దున మేల్కొని జపించువానికి యముని వలన భయము కలుగదు.
10. అతడు సర్వపాప విముక్తుడగును. ఎంతటి పాపాత్ముడైనను నిత్యము భక్తితో దీనిని చదివినచో
యముడు అతనిని కాయవ్యూహముతో తప్పక పవిత్రుని చేయగలడు.
No comments:
Post a Comment