మన్యు సూక్తం manyu suktam
1.యస్తే మన్యో ఽ విధద్ వజ్రసాయక సహ ఓజ: పుష్యతి విశ్వమానుషక్ | సాహ్యామ దాసమార్యం త్వయాయుజా వయం సహస్కృతేన సహసా సహస్వతా||
ఓ మన్యూ! నీకు ఏపురుషుడు పరిచర్య చేస్తున్నాడో ఆ పురుషుడు వజ్రసాయకుడై శత్రువులను నిర్మూలించగలడు. అతడు శత్రువులను అభిభవించగల ఓజస్సుని, శత్రుజయాది లక్షణ కార్యజాతాన్ని సతతము పోషించుచుండును. నీ సహాయంతో అసురుని ఆర్యుని అభిభవించ గలము. బలోత్పాదితమైన, అభిభువన శీలమైన నీ సహాయంతో ఈ పని చేయగలము.
2. మన్యురింద్రో మన్యురేవా స దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదా: | మన్యుం విశ ఈడతే మానుషీర్యా: పాహినో మన్యో తపసా సజోషా: ||
మన్యువే ఇంద్రుడు. మన్యువే ఇతర సకల దేవతలు అవుతున్నాడు. దేవతలకు ఆహ్వాత జాతవేదుడైన అగ్నికూడా మన్యువే. వరుణుడు కూడా మన్యువే !
3. అభీహి మన్యో తవస స్తవీయాన్ తపసా యుజా విజహి శత్రూన్ | అమిత్రహా వృత్రహా దస్యుహా చ విశ్వా వసూన్యా భరా త్వం న: ||
ఓ మన్యూ! అభిముఖుడవై వెళ్లుము ! గొప్ప వానికంటె గొప్పవాడవైన నీవు తపస్సహాయముతో మా శత్రువులను వినాశనము చేయుము. అమిత్ర హంత, వృత్ర హంత, దస్యు హంత యయిన వాడవై సర్వసంపదలను మాకు సమకూర్చుము.
4. త్వం హి మన్యో అభిభూత్యోజా: స్వయంభూర్భామో అభిమాతిషాహ: | విశ్వచర్షణి: సహురి: సహీయా నస్మాస్వోజ: పృతనాసు ధేహి ||
ఓ మన్యూ! నీవు అభిభూతిబల సంపన్నుడవై, స్వయభువుడవై, క్రుద్ధుడవై శత్రువులను సహించెడివాడవై, విశ్వద్రష్టవై సహన శీలుడవై, అట్టి గుణములచే విశిష్టుడవై నీవు యుద్ధాలలో బలాన్ని మాలో కల్పించుము.
5. అభాగ: సన్నప వరేతో అస్మి తవక్రత్వా తవిషస్య ప్రచేత : తం త్వా మన్యో అక్రతు ర్జిహీడాహం స్వా తనూ ర్బలదావా న ఏహి ||
ప్రకృష్టజ్ఞానివై ఓ మన్యూ ! గొప్పదైన ఈ క్రతువులో భాగరహితుడ వైనపుడు యుద్ధమునుండి పరాగతుడ వగుచున్నావు. ఓ మన్యూ ! అలాంటి నిన్ను సంతోషపెట్టు కర్మలేవీ చేయకనే నేను క్రుద్ధుడనైతిని.ఇప్పుడు మాకు స్వశరీరము వంటి నీవు మాకు బలదాతవై రమ్ము.
6. అయం తే అస్మ్యప న ఏహ్యర్వాజ్ ప్రతీచీన: సహురే విశ్వదావన్ | మన్యో వజ్రిన్నభి న ఆవవృత్స్వ హనావ దస్యూం రుత బోధ్యాపే ||
ఓ మన్యూ ! నీకు నేను కర్మకరుడనగుచున్నాను. మాకు అభిముఖుడవై మా కొరకై రా! మా శత్రువులను ప్రతీచీనులను జేయు సహనశీలుడా ! వజ్రీ! మాకు అభిముఖుడవై రమ్ము! మాకు హాని కల్పించు దస్యులను హింసించు! ఆప్తుడనైన నన్ను రక్షణీయుడనని గ్రహించుము!
7. అభిప్రేహి దక్షిణతో భవా నో ఽ ధా వృత్రాణి జంజ్ఘనావభూరి | జుహోమితే ధరుణం మధ్వో అగ్ర ముఖావుపాంశు ప్రథమా పిబావ ||
ఓ మన్యూ ! మాకు అభిముఖుడవై రమ్ము ! మాకు దక్షిణ భాగం లో సచివుడవై నిలువుము! ఓ మన్యూ ! నీకు ధారకమైన మధురసాన్ని సారభూతమైన దాన్ని ఇస్తున్నాను. ఇరువురము సర్వులకు పూర్వభాగినులమై ఎవరికి తెలియకుండా సోమరసమును గ్రోలెదముగాక !
No comments:
Post a Comment