ధర్మ సందేహాలు 4
1). అభ్యంగన స్నానం అంటే ఏమిటి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి
జ). ★ ఇక్కడ అభి అంటే నూనె అంగి అంటే శరీరంలోని అన్ని అంగాలు
★ చాలా మంది అభ్యంగన స్నానం అంటే తలపై నీరు పోసుకుని చేసే స్నానం అనుకుంటారు కాని అది తలస్నానం
★ అభ్యంగన స్నానం అంటే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని సున్నిపిండితో నలుగు పెట్టుకుని తరువాత తలస్నానం చేయాలి దీనినే అభ్యంగన స్నానం లెదా తలంటు స్నానం అంటారు
★ అభ్యంగన స్నానాన్ని గురువారం చేస్తే ఉత్తమం
★ అభ్యంగన స్నానాన్ని శుక్రవారం, శనివారం, ఆదివారం చేయకూడదు.
★ నూనె ఏగ్రహాలకి ఇష్టమో ఆ గ్రహాల వారంనాడు అభ్యంగన స్నానం చేయకూడదు
2). ఆచారం పాటించడం వల్ల లాభం ఏమిటి
జ). ఆచారం పాటించుట వలన ఆయువు, సంతానం, ఎప్పటికీ తరగని ఆహారం పొందవచ్చును. ఆచారము పాపాలను పోగొడుతుంది. శుభాలను ఇస్తుంది. ఇహలోకంలో సుఖాలతో పాటు పరలోకంలో ఉత్తమగతి లభిస్తుంది. ఆచారవంతులు సదా పవిత్రులు. ధన్యులు ఇదిముమ్మాటికీ నిజం అని నారాయణుడు నారదునితో చెప్పాడు.
3). కోళ్ళ పందెములు ఎడ్ల పందెములను శాస్త్రం సమర్దిస్తుందా
జ). సేకరణ : (పద్మ పురాణం, కూర్మ పురాణం)
కోళ్ళ పందెములు ఎడ్ల పందెములను శాస్త్రం సమర్దించదు. వీటి గురించి కూర్మపురాణం పద్మపురాణంలో ఇలా చెప్పబడింది
"పరస్పరం పశూన్ వ్యాళాన్ పక్షిణో నావబోధయేత్"
"పరస్పరం పశూన్ వ్యాఘ్రాన్ పక్షిణో న చ యోధయేత్"
పశువులను కోడి మొదలగు పక్షులను పులులను వాటిలో అవి పోట్లాడుకొనుటకు ఏవిధముగానూ వాటీని రెచ్చగొట్టడం (కోళ్ళ పందెములు మొదలైనవి) మహాపాపం
4). దేవాలయాలలో ఎన్ని మార్లు ప్రదక్షిణ చేయాలి
జ). జ:) సేకరణ : (నారద పురాణం)
దేవాలయములో ప్రదక్షిణ చేయునపుడు అమ్మవారి దేవాలయములో ఒకసారి
సూర్యుడి దేవాలయంలో ఏడుసార్లు
విష్ణువు దేవాలయంలో నాలుగు సార్లు
వినాయక దేవాలయంలో మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి
5). కుల పర్వతాల పేర్లు ఏమిటి
జ). 1.మహేంద్రం 2.మలయం 3.సహ్యం
4. శుక్తిమంతం 5.గంధమాదనం 6.వింద్యం
7. పారియాత్రం
6). శ్రీకృష్ణ పరమాత్మ 64 కళలను 64 రోజులలో నేర్చుకున్నాడంటారు అవి ఏ కళలు ?
జ). చతుష్షష్టి కళలు
1. వేదం 2. శాస్త్రం 3. ధర్మశాస్త్రం
4. వ్యాకరణం 5.జ్యోతిష్యం 6.ఆయుర్వేదం
7.కవిత్వం 8. గాంధర్వం 9. స్వర శాస్త్రం
10. సాముద్రికం 11. మల్లవిద్య 12. గారుడం
13. కొక్కోకం 14. శకునం 15. వాక్చమత్కారం
16. బూజ విజయం 17.లిపి జ్ఞానం 18. లిపి లేఖనం
19. దేశభాషలు 20. ఆరద గమనం 21. రత్న పరీక్ష
22. అస్త్ర విద్య 23. పాక చమత్కారం 24. కుట్టుపని
25. శిల్ప శాస్త్రం 26. జంతుభేదం 27. వృక్షదోహన క్రియ
28.ఆగమ శాస్త్రం 29. మహేంద్ర జ్ఞానం 30. ఇంద్రజాల విద్య 31.రసగంధ వాదం 32. చిత్ర లేఖనం 33. భూపాల విధి 34. అంజన విశేషములు 35. వాస్తు శాస్త్రం 36. వాయు, జలాగ్ని స్తంబన 37. ధ్వని విశేషం 38. గుటికా శుద్ధి 39. సర్ప శాస్త్రం 40. అవిద్యాశ్శోదనా విద్య 41. పశుపాలనా విద్య 42. విహంగ భేదగతి 43 అభినయ శాస్త్రం 44. చోరత్వ ధీమంతం 45. వడ్రంగం 46. మోదర 47. చర్మకట్టు 48.మణిమంత్రౌషధ సిద్ధి 49. లోహకారకత్వం
50. కాశపని 51. ప్రశ్న శాస్త్రం 52. వ్యాపారం
53. స్వప్న శాస్త్రం 54. కులాల శాస్త్రం 55. వేట
56. గణిత శాస్త్రం 57. కార్యకరణ విద్య 58. దుతికా కృత్యం 59. చరాచరాన్యధాకరణం 60. తంతు విద్య 61. యోగరాజం 62. సేద్యం 63. మిత్రభేదం
64. తురగారోహాణం
7). భూమిపై (కటికనేలపై) పెట్టకూడని వస్తువులు ఏమిటి
జ).【సేకరణ ■ దేవీభాగవతం】
ముత్యాలు, ఆల్చిప్పలు, తులసి, పూజా ద్రవ్యాలు, శివ లింగం, దేవతా మూర్తులు (విగ్రహాలు పటములు మొదలైనవి) శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞ సూత్రం, పువ్వులు, పుస్తకాలు, పుష్ప మాల, జపమాల, రుద్రాక్ష, గంధపు చెక్క, దర్భలు, కర్పూరము, బంగారం, గోరోచనం, చందనం, సాలగ్రామ శిలలు వీటిని నేరుగా ఎటువంటి అచ్ఛాదన లేకుండా భూమిపై పెట్టకూడదు. ఈవస్తువులను భూదేవికి సమర్పించినా నేరుగా భూమిపై పెట్టినా అటువంటి వారు నరకానికి వెళ్తారని శ్రీమహావిష్ణువు భూదేవితో చెప్పాడు ఇంకా వట్టి నేలపై దీపం వెలిగించినవారు ఏడు జన్మలవరకూ గుడ్డివాడు అవుతాడు.
ఏ అచ్ఛాదన లేకుండా నేలపై శంఖం పెడితే వారికి జన్మాంతరంలో కుష్టు రోగం వస్తుంది. ఇంకా ఇలా ఎన్నో నరకాలు శిక్షలు చెప్పబడ్డాయి
8).తులసి మాలలను స్త్రీలు ధరించవచ్చా
జ). తులసి మాలలను అందరూ ధరించవచ్చు. దీనికి పురుషులు, స్త్రీలు, సుమంగళి స్త్రీలు, భర్తలేని స్త్రీలు, అనే ఎటువంటి బేధాలు లేకుండా అందరూ ధరించవచ్చు.
No comments:
Post a Comment