ధర్మ సందేహాలు 3
1. పూజ గదిలో దీపాలు వెలిగినంతసేపు తలుపులు మూసి ఉంచాలా
జ). పూజ గదిలో దీపాలు వెలిగించినప్పుడు తలుపులు మూయకూడదు. దీపాలు వెలుగుతున్నంతసేపూ తలుపులు తెరిసే ఉంచాలి. గాలి వల్ల దీపం ఆరిపోతుందనిపిస్తె దేవుడు గది తలుపులు కొంచెం వార dharma గా మూయండి అంతేకాని తలుపులు పూర్తిగా మూసేయకండి. దీపం కొండెక్కిన తరువాత మాత్రం దేవుడు గది తలుపు మూసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. దేవుడి గదిలోనే కాదు ఇంటిలో ఎక్కడైనా దీపం వెలిగించినప్పుడు కూడా ఇంటికి ఉన్న ప్రధాన తలుపులు తెరిచి ఉంచాలి.
2.దేవతలకు నివేదించే పదార్థాలు శ్రద్ధ లేకుండా నివేదిస్తే ఫలితం ఉంటుందా
జ). దేవతలు స్వభావతః పవిత్రమైన వానినే కోరుకుందురు అందువలన అపవిత్రమైన వస్తువులను అసహ్యించుకుంటారు. ఐనప్పటికీ శ్రద్ధగా సమర్పించినచో వాటిని స్వీకరింతురు.
పవిత్రమైనా శ్రద్ధ లేకుండా నివేదించిన పదార్థము శ్రద్ధ ఉన్నను అపవిత్రమైన పదార్థము ఈ రెండింటిలో ఏది గొప్ప అను విషయముపై దేవతలందరూ బాగా చర్చించి రెండూ సమానమే అనిరి. కానీ ప్రజాపతి వారితో ఇవి రెండూ సమానం కావు. శ్రద్ధ లేకుండా సమర్పించిన పదార్థము వ్యర్థం. కానీ శ్రద్ధతో సమర్పించుట వలన పవిత్రమైన పదార్థము చాలా గొప్పది అని తెలిపెను
3. పూజలో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి
జ). దేవునకు ఎడమవైపు నీటిపాత్ర (కలశం), గంట, ధూప పాత్ర ఉంచవలెను. ఎడమవైపు నూనె దీపాలు వెలిగించాలి. కుడివైపు నేతి దీపం, సువర్ణ జలంతో నింపిన శంఖం ఉంచాలి. దేవుడికి ఎదురుగా హారతి కర్పూరం, పసుపు కుంకుమ ఉంచవలెను.
4. అల్ఫాహరం తిని పూజ చేయవచ్చా?
జ). భోజనం చేసిన తరువాత అల్పాహారం తీసుకున్న తర్వాత పూజ చేయకూడదు. మనం ఏదైనా తింటే శరీరానికి దోషం వస్తుంది. ఆదోషం స్నానం చేస్తే కాని పోదు. ఒకవేళ ఆకలికి తట్టుకోలేక ఏదైనా తిన్న తిన్న తరువాత తప్పనిసరిగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు
శాస్త్ర ఆధారం (గౌతమ స్మృతి)
5.మంచంపై కూర్చుని భోజనం చేయవచ్చా
జ). ఏవస్తువును ఎందుకు ఉపయోగించాలో అందుకే ఉపయోగించాలి. కుర్చీ ఉంటే కూర్చోడానికి ఉపయోగించాలి. మంచం పడుకోవడానికి ఉపయోగించాలి. పడుకునేటప్పుడు తప్ప ఇంక మిగిలిన సందర్భాలలో మంచాన్ని తాకకూడదు. శాస్త్రం అయితే మంచం మీద కూర్చుని ఔషదం కూడా తీసుకోకూడదు అని చెప్పింది. ఇంక భోజనం విషయానికి వస్తే ఎన్నో నియమాలు ఉన్నాయి అందులో కొన్ని నిల్చుని కాని, ఒళ్ళో పెట్టుకొని కాని, మంచంపై కూర్చునిగాని భోజనం చేసిన వారికి దారిద్ర్యం నిశ్చయం. కాబట్టి మంచంపై భోజనం దరిద్రం
శాస్త్ర ఆధారం (స్మృతులు, పురాణాలు)
6.నైవేద్యానికి మహా నైవేద్యానికి తేడా ఏమిటి
జ). నైవేద్యం రెండు రకాలు అవసర నైవేద్యం, మహా నైవేద్యం. అవసర నైవేద్యం అంటే తాత్కాలిక నైవేద్యం.
ఉదాహరణకు ఒక మహదేవతను పూజించే నప్పుడు ముందుగా గణపతిని పూజిస్తాం అపుడు గణపతికి బెల్లం ముక్క లేదా అరటి పండ్లో సమర్పిస్తారు అది అవసర నైవేద్యం
మహా దేవతకు భక్ష్య,భోజ్య, శోష్య, లేహ్యాలతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు. అది మహా నైవేద్యం
శాస్త్ర ఆధారం (తంత్ర శాస్త్రం)
7.దేవుడు దగ్గర దీపాలు ఏ నూనెతో వెలిగిస్తే మంచిది
జ). దేవుడు దగ్గర దీపాలు ఆవునెయ్యితో వెలిగించాలి. ఆవునెయ్యి లేకపోతే గేదె నెయ్యితో వెలిగించాలి. అదీ లేకపోతే నువ్వుల నూనెతో వెలిగించాలి. నువ్వుల నూనె కూడా లేకపోతే ఆముదం లేదా కొబ్బరి లేదా వేరుశనగ లేదా కుసుమ నూనెతో వెలిగించాలి
8. మంగళసూత్రానికి ముత్యాలు, నల్లపూసలు ఎన్ని ఉండాలి
జ). మంగళ సూత్రానికి నల్లపూసలు, ముత్యాలు 9 లేదా 18 లేదా 27 లేదా 36 ఉండాలి లేదా తొమ్మిది సంఖ్యతో సంబంధం ఉండే విధంగా ఉండాలి
ఉదాహరణకు
9×1=9
9×2=18
9×3=27
9×4=36
ఈ విషయాన్ని స్వయంగా శివుడు పార్వతీ దేవికి చెప్పాడు ఇలా చేస్తే ఆ స్త్రీకి వైధవ్య బాధ ఉండదు
No comments:
Post a Comment