ఆంజనేయుడికి మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి.
జ). సేకరణ (పరాశర సంహిత)
ఆంజనేయునికి మొత్తం చాలా అవతారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తొమ్మిది అవతారాలను పరాశర సంహిత వివరించింది.
1.) ప్రసన్నాంజనేయ అవతారం
స్వామి ఈ అవతారంలో భక్తులకు అభయం ఇస్తూ గద క్రిందకు ఉంటుంది.
2.) వీరాంజనేయ అవతారం
మైందుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడు
3.)వింశతిభుజ అవతారం
ఈ అవతారంలో స్వామికి ఇరవై చేతులు ఉంటాయి. ఈ అవతారం వల్లే స్వామికి భవిష్యద్బహ్మ అయ్యే వరం వచ్చింది
4). పంచముఖ ఆంజనేయ అవతారం
సీతమ్మతల్లి శతకంఠ రావణుడిని వధించే సమయంలో స్వామి ఈ అవతారం ధరించాడు. ఈ అవతారంలో స్వామికి ఐదు ముఖాలుంటాయి.
5). అష్టాదశభుజాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామికి 18చేతులు ఉంటాయి. మృత సంజీవని విద్యకు అధిపతి.
6.) సువర్చలాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామి భార్య అయిన సువర్చలా దేవితో కలిసి ఉంటాడు.
7). చతుర్భుజాంజనేయ అవతారం.
ఈ అవతారంలో స్వామి నాలుగు చేతులతో ఉంటాడు. కపిలుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడు.
8). ద్వాత్రిశభుజాంజనేయ అవతారం
ఈ అవతారంలో స్వామికి 32 చేతులు, మూడు తలలు ఉంటాయి
9).వానరాంజనేయ
రామాయణంలో మనకు కనపడే ఆంజనేయస్వామి అవతారమే ఈవానరాంజనేయ అవతారం.
ఈ నవ అవతారాలే గాక సప్తముఖీ ఆంజనేయ, ఏకాదశముఖీ ఆంజనేయ వంటి అవతారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
No comments:
Post a Comment