హనుమంతుడికి వడమాలలు(గారెల దండలు) ఎందుకు వేస్తారు
ఆంజనేయస్వామి కి వడమాలలు ఎందుకు వేస్తారు.
జ). సేకరణ. (పరాశర సంహిత)ఆంజనేయుడు శనివారం పుట్టాడు. శనివారానికి అధిపతి శని. శనికి ఇష్టమైన వస్తువులు నువ్వులు, మినప్పప్పు. వడ(గారె)లను మినప్పప్పుతో చేస్తారు. ఒక సమయంలో ఆంజనేయుడికి శనికి యుద్ధం జరిగింది. ఆయుద్దంలో శని ఓడిపోయాడు. శని ఆంజనేయుడికి శిష్యుడయ్యాడు. ఆంజనేయుడు శనిని ఇలా ఆజ్ఞాపించాడు
" ఎవరైతే శనివారం నాడు నీకు ఇష్టమైన మాషములు(మినుములు) రుబ్బి మాషచక్రాలు(గారెలు) నాకు సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారో వారి యందు శని దోషం లేకుండా చూడు. వారిని అనుగ్రహించు"
అందుకే శని దోష నిమిత్తం ఆంజనేయ స్వామికి వడమాలలు సమర్పిస్తారు.
No comments:
Post a Comment