అన్నప్రాశన విధానం
అన్నప్రాశన అనేది పుట్టిన బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే కార్యక్రమం
ఈ సంస్కారము వలన శిశువుకు ఆయుర్వృద్ధి తేజస్సు ఆరోగ్యం సమకూరుతాయని ప్రజల విశ్వాసం.
అన్నప్రాశన ఎక్కడ చేయాలి
అన్నప్రాశన కార్యక్రమం దేవుడి గుడిలో లేదా శిశువు యొక్క అమ్మమ్మ ఇంట్లో చేయాలి
అన్నప్రాశన ఎప్పుడు చేయాలి
అన్నప్రాశన ఆడపిల్లలకు శిశువు పుట్టిన ఐదు నెలల పదకొండు రోజుల తర్వాత నుండి ఆరవ నెల ప్రవేశించే లోపు చేయాలి. లేదా శిశువు పుట్టిన సంవత్సరం లోపు
బేసి సంఖ్య గల నెలలో చేయాలి.
మగపిల్లలకు అయితే శిశువు పుట్టిన ఆరవ నెలలో లేదా పుట్టిన సంవత్సరం లోపు సరి సంఖ్య గల నెలలో చేయాలి.
అన్నప్రాశన ఆడపిల్లలకు ఐదవ నెల మగపిల్లలకు ఆరవ నెల చేయడం శ్రేష్ఠం అని శాష్త్ర వచనం
అన్నప్రాశనకు శుభ సమయాలు
శుభ తిథులు
విదియ,తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, చతుర్దశి
కృష్ణ పక్షంలో వచ్చే చివరి మూడు తిథులు (త్రయోదశి చతుర్దశి అమావాస్య) పనికిరావు
శుభ వారములు
సోమ, బుధ, గురు, శుక్ర
శుభ నక్షత్రములు
అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర,హస్త, చిత్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి
శుభ లగ్నములు
వృషభ, మిథునం, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు, మీన లగ్నాలు మంచివి.
దశమ స్థానంలో ఏగ్రహలు ఉండకూడదు. ముహూర్త సమయానికి బుధ, కుజ, శుక్ర గ్రహలు ఒక వరుసలో ఉండకూడదు.
లగ్నంలో రవి ఉండకూడదు. అలా ఉంటే ఆ శిశువుకు కుష్టు రోగం వచ్చే అవకాశం ఉంటుంది
లగ్నంలో క్షీణ చంద్రుడు ఉంటే దరిద్రుడు అవుతాడు
కుజుడు ఉంటే పైత్య రోగి, శని ఉంటే వాత రోగి అవుతాడు. రాహు, కేతువులు ఉంటే మిక్కిలి దరిద్రుడు అవుతాడు.
శుభ గ్రహములు
లగ్నంలో పూర్ణ చంద్రుడు ఉంటే అన్నదాత అవుతాడు. బుధుడు ఉంటే విశేష జ్ఞానవంతుడు, గురుడు ఉంటే భోగి, శుక్రుడు ఉంటే దీర్ఘాయువు కలవాడు అవుతాడు.
No comments:
Post a Comment